Threat to PM Modi, Amit Shah: మోదీ, అమిత్ షా, నితీశ్‌లను చంపేస్తానని బెదిరింపు కాల్స్!

Threat to PM Modi, Amit Shah, Bihar CM Nitish Kumar : ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లను చంపేస్తాం అంటూ ఒక వ్యక్తి ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఢిల్లీ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు.

Written by - Pavan | Last Updated : Jun 23, 2023, 01:44 PM IST
Threat to PM Modi, Amit Shah: మోదీ, అమిత్ షా, నితీశ్‌లను చంపేస్తానని బెదిరింపు కాల్స్!

Threat to PM Modi, Amit Shah, Bihar CM Nitish Kumar : ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లను చంపేస్తాం అంటూ ఒక వ్యక్తి ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఢిల్లీ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. తొలుత బుధవారం ఉదయం 10.46 గంటలకు ఢిల్లీ పోలీసు కంట్రోల్ రూమ్ కి పీసీఆర్ కాల్ చేసిన గుర్తుతెలియని వ్యక్తి.. తనకు రూ. 10 కోట్లు ఇవ్వకపోతే బీహార్ సీఎం నితీశ్ కుమార్ ని చంపేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ ఫోన్ కాల్ తో అలర్ట్ అయిన ఢిల్లీ పోలీసులు.. ఆ కాలర్ ఎవరా అని ఆరా తీస్తుండగానే 10.54 గంటలకు మరోసారి ఫోన్ చేసిన అదే కాలర్.. ఈసారి ప్రధాని మోదీ, అమిత్ షాలను చంపేస్తానని బెదిరించాడు. తనకు రూ. 2 కోట్లు ఇవ్వకపోతే ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను అంతం చేస్తానంటూ బెదిరించాడు.

రెండోసారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడటంతో ఈసారి ఢిల్లీ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఢిల్లీ పోలీసుల సైబర్ వింగ్ రంగంలోకి దిగి కాలర్ ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేశారు అనే కోణంలో ఆరాతీయడం మొదలుపెట్టింది. కాలర్ ఆచూకీ తెలుసుకోవడం కోసం అన్ని సాంకేతిక పద్దతులను ఉపయోగించారు. 

చివరకు లభించిన కాలర్ జాడ:

ఢిల్లీ పోలీసుల అన్వేషణ ఫలించింది. అన్ని సైబర్ పద్ధతులను ఉపయోగించిన ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు కాలర్ ఎవరు, అతడు ఎక్కడి నుంచి ఫోన్ చేశాడు అనే వివరాలు కనుక్కున్నారు. ఢిల్లీ పోలీసులకు పీసీఆర్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి పేరు సుధీర్ శర్మ.. అతడు ఈస్ట్ ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ప్రాంతంలో నివాసం ఉంటాడు అని కనుక్కున్నారు. కాలర్ లొకేషన్, ఐడెంటిటీ తెలియడంతోనే ఢిల్లీ పోలీసులు పశ్చిమ్ విహార్ పోలీసులను అలర్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Virat Ramayan Mandir: ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ నిర్మాణం ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

ఉన్నతాధికారుల ఆదేశాలతో నలుగురు పోలీసులను వెంటపెట్టుకుని అక్కడకు చేరుకున్న పశ్చిమ్ విహార్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్.. సుధీర్ శర్మ ఇంటి తలుపు తట్టారు. ఆ సమయంలో అతడు అక్కడ లేడు అని తెలుసుకున్న పోలీసులు.. అతడి పదేళ్ల కొడుకు నుంచి మరిన్ని వివరాలు రాబట్టారు. అప్పుడే తెలిసింది.. వృత్తిరీత్యా కార్పెంటర్ పనిచేసుంటున్న సుధీర్ శర్మ.. ఒక పెద్ద తాగుబోతు అని. రాత్రి, పగలు అని తేడా లేకుండా తాగే తన తండ్రి.. ఇవాళ తెల్లవారుజాము నుంచే తాగుతున్నాడు అని అతడి కుమారుడు అంకిత్ పోలీసులకు చెప్పాడు. అంకిత్‌తోనే అతడి తండ్రి సుధీర్ శర్మకు ఫోన్ చేయగా.. తాగిన మైకంలో అతడు ఏదేదో మాట్లాడటం పోలీసులు గమనించారు. ప్రస్తుతం సుధీర్ శర్మను పట్టుకునే పనిలో ఢిల్లీ పోలీసులు బిజీ అయ్యారు. ఇదిలావుంటే, ప్రధాని మోదీతో పాటు దేశంలోని పెద్ద పెద్ద రాజకీయ నాయకులను హతమారుస్తాం అటూ బెదిరింపు కాల్స్ రావడం ఇదేం మొదటిసారి కాదు. గత నెలలోనూ ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తాం అంటూ బెదిరింపు కాల్స్ రావడం, పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడం తెలిసిందే.

ఇది కూడా చదవండి: 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బహుమతి.. లోక్‌సభ ఎన్నికలకు ముందే మోదీ సర్కారు గ్రీన్ సిగ్నల్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News