Virat Ramayan Mandir: ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ నిర్మాణం ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

Virat Ramayan Mandir: ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ నిర్మాణ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. దీనిని బిహార్‌లోని తూర్పు చంపారణ్‌ జిల్లా కల్యాణ్‌పుర్‌ బ్లాకు కైథవలియా గ్రామంలో నిర్మిస్తున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2023, 08:38 AM IST
Virat Ramayan Mandir: ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ నిర్మాణం ప్రారంభం.. ఎక్కడో తెలుసా?

Virat Ramayan Mandir: ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా పేర్కొంటున్న విరాట్ రామాయణ మందిర నిర్మాణం ప్రారంభమైంది. మంగళవారం భూమి పూజ అనంతరం ఈ గుడి నిర్మాణ పనులను మెుదలుపెట్టారు. ఈ ఆలయాన్ని బిహార్‌లోని తూర్పు చంపారణ్‌ జిల్లా కల్యాణ్‌పుర్‌ బ్లాకు కైథవలియా గ్రామంలో నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణాన్ని 2025 నాటికి పూర్తి చేయాలని సంకల్పించుకున్నారు. 

నిన్న ఉదయం 11 గంటలకు పట్నా మహావీర్‌ మందిర్‌ న్యాస్‌ సమితి అధినేత ఆచార్య కిశోర్‌ కునాల్‌ నేతృత్వంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆనంతరం ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు.  ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అంతేకాకుండా ప్రాంగణమంతా జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిపోయింది. 

అయోధ్య రామ మందిరంలానే ఈ విరాట్ రామాయణ మందిర్ కూడా భక్తులను ఆకట్టుకుంటుందని ఆచార్య కిశోర్‌ కునాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కంబోడియాలోని అంగ్‌కోర్‌ వాట్‌ ఆలయం ఎత్తు 215 అడుగులు కాగా.. తాజాగా నిర్మిస్తున్న విరాట్‌ రామాయణ ఆలయం ఎత్తు 270 అడుగుల ఉంటుంది.  ఈ మందిరాన్ని 125 ఎకరాల విస్తీర్ణంలో ఇన్‌ఫ్రా సన్‌టెక్‌  ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ నిర్మిస్తోంది. 

Also Read: Jagannath Rath Yatra 2023: ప్రతి సంవత్సరం పూరీ జగన్నాథుని రథయాత్ర ఎందుకు నిర్వహిస్తారో తెలుసా? తెలుసుకోవడం మన బాధ్యత!

అంతేకాకుండా ఇక్కడ  33 అడుగుల ఎత్తు, 33 అడుగుల వెడల్పుతో ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ఏర్పాటు చేయనున్నారు. ఈ లింగాన్ని మహాబలిపురంలో తయారుచేయనున్నారు. 1,008 శివలింగాలను ఒకే లింగంలో పేర్చి దీనికి సరికొత్త రూపును ఇవ్వనున్నారు. ఈ ఆలయ ప్రాంగణం 12 టవర్లతో 22 దేవాలయాల సముదాయంగా ఉంటుంది.  ఈ ఆలయం అయోధ్య నుంచి జనక్ పుర్ మార్గంలో ఉండటం విశేషం. ఇక్కడ హెలిఫ్యాడ్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. 

Also Read: Indian Railways: దేశంలోని తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఎక్కడ, ఎలా ఉంటుందో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News