PM KISAN Yojana Money: పీఎం కిసాన్ యోజన 14వ విడత లేటెస్ట్ అప్‌డేట్.. స్టేటస్ ఇలా చెక్ చేస్కోండి

PM KISAN Yojana Next Installment Money: రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం కింద అందించే పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్ కోసం సన్నకారు రైతులు ఎదురుచూస్తున్న సమయం ఇది. ఈ పథకం కింద కేంద్రం ప్రతీ ఏడాది ఒక్క రైతుకు ఒక్కో విడతకు రూ. 2 వేలు చొప్పున మొత్తం రూ.6000 అందిస్తోన్న సంగతి తెలిసిందే.

Written by - Pavan | Last Updated : Jun 13, 2023, 06:14 AM IST
PM KISAN Yojana Money: పీఎం కిసాన్ యోజన 14వ విడత లేటెస్ట్ అప్‌డేట్.. స్టేటస్ ఇలా చెక్ చేస్కోండి

PM KISAN Yojana Next Installment Money: రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం కింద అందించే పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్స్ కోసం సన్నకారు రైతులు ఎదురుచూస్తున్న సమయం ఇది. దున్నకాలు చేపట్టి, విత్తనాలు, నారు చల్లే సమయం సీజన్ కావడంతో కేంద్రం విడుదల చేసే పీఎం కిసాన్ యోజన పథకం డబ్బులు ఎంతో కొంత తమ అవసరాలకు పనికొస్తాయేమో అనేది సన్నకారు రైతుల భావన. కేంద్రం పీఎం కిసాన్ యోజన పథకం ప్రారంభించిన తరువాత ఇప్పటికే 13 విడతల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ కాగా.. తాజాగా 14వ విడత ఎప్పుడు విడుదల కానుందా అనేదానిపైనే అందరి దృష్టి నెలకొని ఉంది.

అవును, పీఎం కిసాన్ యోజన పథకం లబ్ధిదారులు 14వ విడత నగదు విడుదల కోసం వేచిచూస్తున్నారు. మీడియాలో వస్తోన్న కథనాల ప్రకారం జూన్ 3వ వారంలో 14వ విడత నగదు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, 14వ విడత నగదు విడుదలపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్రం అందించే ఆర్థిక సహాయాన్ని పొందాలి అని అనుకునే వారు pmkisan.gov.in లో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కింద కేంద్రం ప్రతీ ఏడాది ఒక్క రైతుకు ఒక్కో విడతకు రూ. 2 వేలు చొప్పున మొత్తం రూ.6000 అందిస్తోంది. లబ్ధిదారుల ఖాతాల్లో కేంద్రమే ఈ మొత్తాన్ని జమ చేస్తూ వస్తోంది. 

ఇంతకీ ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం అంటే ఏమిటి ?
2019లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన పీఎం కిసాన్ యోజన అనే పథకం కింద దేశంలోని కోట్లాది మంది సన్నకారు రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే ప్రతీ ఏటా రూ.6000 జమ చేయడం జరుగుతోంది. ప్రతీ 4 నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున ఏడాదికి రూ. 6 వేలు లభిస్తాయి.

ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం స్టేటస్ ఎలా చెక్ చేయాలి..
పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ pmkisan.gov.in లోకి లాగిన్ అవ్వాలి.
హోమ్‌పేజీలో ఫార్మర్స్ కార్నర్ అనే బటన్ క్లిక్ చేయాలి.
ఆ తరువాత వచ్చే పేజీలో పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
వెబ్‌సైట్‌లో అడిగిన వివరాలు ఎంటర్ చేయండి. ఆ తరువాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
వన్-టైమ్ పాస్‌వర్డ్‌ కోసం  గెట్ ఓటిపి అనే బటన్ పై క్లిక్ చేయండి.
మీ ఫోన్ నెంబర్ కి ఒక OTP వస్తుంది. ఆ ఓటీపీని సబ్మిట్ చేసిన తర్వాత, మీరు పీఎం కిసాన్ లబ్ధిదారుని స్థితిని తెలుసుకోవచ్చు.
పీఎం కిసాన్ యోజన పథకం లబ్ధిదారులకు E-KYC తప్పనిసరి అనే విషయం మర్చిపోవద్దు.
eKYC పూర్తి చేసుకోని వారికి కేంద్రం అందించే 14వ విడత పీఎం కిసాన్ యోజన పథకం బెనిఫిట్స్ అందకపోవచ్చు.

ఇది కూడా చదవండి : How To Earn More Money on Youtube: యూట్యూబ్‌లో ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా ?

పీఎం కిసాన్ యోజన పథకం eKYC ని ఎలా అప్‌డేట్ చేయాలంటే..
పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవండి.
హోమ్ పేజీలో eKYC పై క్లిక్ చేయండి.
అక్కడి పేజీలో మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి, సెర్చ్ అనే బటన్‌ని నొక్కండి.
ఆ తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక OTP వస్తుంది.
ఆ OTP సబ్మిట్ చేస్తే పిఎం కిసాన్ యోజన పథకం మీ ఆధార్ ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిపోయినట్టే.

ఇది కూడా చదవండి : Maruti Suzuki Alto Tour H1: మారుతి సుజుకి నుంచి మరో చీప్ అండ్ బెస్ట్ కారు

ఇది కూడా చదవండి : Honda Dio H Smart Features: రూ. 70 వేల స్కూటర్‌.. కారు లాంటి సేఫ్టీ ఫీచర్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News