Rajiv Gandhi Assassination case: ముద్దాయి నళిని ఆత్మహత్యాయత్నంపై సందేహాలు

రాజీవ్ గాంధీ హత్యకేసు ముద్దాయి నళిని వెల్లూరు సెంట్రల్ జైలులో ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. 29 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న నళినీ  ఆత్మహత్యాయత్నంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనపై దర్యాప్తు చేయించాలని నళిని తరపు న్యాయవాది డిమాండ్ చేస్తున్నారిప్పుడు.

Last Updated : Jul 21, 2020, 02:48 PM IST
  • 1. వెల్లూరు జైల్లో ఆత్మహత్యకు ప్రయత్నించిన నళిని శ్రీహరన్
  • 2. రాజీవ్ గాంధీ హత్యకేసులో ముద్దాయిగా నళిని

    3. 29 ఏళ్లుగా జైళ్లోనే మగ్గుతున్న వైనం

Rajiv Gandhi Assassination case: ముద్దాయి నళిని ఆత్మహత్యాయత్నంపై సందేహాలు

రాజీవ్ గాంధీ హత్యకేసు ముద్దాయి నళిని వెల్లూరు సెంట్రల్ జైలులో ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. 29 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న నళినీ  ఆత్మహత్యాయత్నంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనపై దర్యాప్తు చేయించాలని నళిని తరపు న్యాయవాది డిమాండ్ చేస్తున్నారిప్పుడు.

నళినీ శ్రీహరన్. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో ముద్దాయి.  నళిని, నళిని భర్త సహా 7 మందికి 1991 మే 21 న జరిగిన రాజీవ్ గాంధీ హత్యకేసులో ముద్దాయిలుగా నిర్ధారిస్తూ టాడా కోర్టు  శిక్ష విధించింది. ముందు వీరికి ఉరిశిక్ష విధించినా...అనంతరం జీవిత ఖైదుగా మార్చారు. అప్పట్నించి అంటే దాదాపు 29 ఏళ్లుగా నళిని వెల్లూరు సెంట్రల్ జైలులో మగ్గుతోంది. జీవితఖైదు కాల పరిమితి ఎప్పుడో పూర్తయినా వివిధ రకాల సాంకేతిక కారణాల దృష్ట్యా,  నిర్ణయాల్లో జరుగుతున్న జాప్యం కారణంగా నళిని శ్రీహరన్ సుదీర్ఘకాలంగా జైల్లోనే ఉండిపోయింది. Also read: Delhi: జగన్ బాటలో కేజ్రీవాల్

సోమవారం రాత్రి వెల్లూరు జైల్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించడం సంచలనమైంది. ఇన్నేళ్లుగా జైళ్లో ఉన్న నళిని ఆత్మహత్యకు ప్రయత్నించడం వెనుక కారణాలేంటనేది ఇంకా తెలియలేదు. కానీ ఆమె తరపు న్యాయవాది పుగలేంతి మాత్రం ఈ ఘటనపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. జైళ్లో మరో సహ జీవితఖైదికు నళినికు మధ్య ఘర్షణ జరిగిందని..దీన్ని ఆత్నహత్యాయత్నంగా చిత్రీకరించారనేది నళిని న్యాయవాది చెబుతున్న వాదన. Also read: Corona Symptoms: కోవిడ్19 వైరస్ అదనపు లక్షణాలివే

ఈ నేపధ్యంలో సంఘటనపై దర్యాప్తు చేయించడమే కాకుండా పుళ్లాల్ జైలుకు తరలించాలని కోరారు. ఈ మేరకు పిటీషన్ దాఖలు చేయనున్నట్టు నళిని న్యాయవాది తెలిపారు.

Trending News