Groom Friends Cricket Deal: వధువుతో ఒప్పందం చేసుకున్న వరుడి స్నేహితులు.. బాండు రాయించుకుని మరీ..!

Bride Sign on Cricket Deal for Bridegroom. పెళ్లయిన తర్వాత కూడా తమతో క్రికెట్‌ ఆడేందుకు అనుమతించాలని వరుడి స్నేహితులు వధువుతో ఒప్పందం చేసుకున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 12, 2022, 08:52 AM IST
  • వధువుతో ఒప్పందం చేసుకున్న వరుడి స్నేహితులు
  • బాండు రాయించుకుని మరీ
  • పెళ్లయిన తర్వాత కూడా
Groom Friends Cricket Deal: వధువుతో ఒప్పందం చేసుకున్న వరుడి స్నేహితులు.. బాండు రాయించుకుని మరీ..!

Groom Friends signs cricket contract with Bride in Tamilnadu: సాధారణంగా పెళ్లి అంటే.. వరుడి, వధువుని వారి వారి స్నేహితులు ఆటపట్టించడం సర్వసాధారణం. అదే సమయంలో గిఫ్ట్స్ ఇవ్వడం కూడా సహజమే. అయితే ఓ వధువు నుంచి వరుడి స్నేహితులు గిఫ్ట్ పొందిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వరుడి స్నేహితులు వధువు చేత ఓ బాండు పేపరుపై ఒప్పందం రాయించుకున్నారు. ఎప్పటిలానే పెళ్లయిన తర్వాత కూడా తమతో క్రికెట్‌ ఆడేందుకు అనుమతించాలని వరుడి స్నేహితులు వధువుతో ఒప్పందం చేసుకున్నారు. విషయంలోకి వెళితే... 

తమిళనాడులోని మదురై జిల్లా ఉసిలంబట్టి మున్సిపాలిటీ పరిధిలోని కీజాపుదూర్‌ ప్రాంతానికి చెందిన హరిప్రసాద్‌ వృతిరీత్యా లెక్చరర్‌. తేనిలోని ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆయన లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. హరిప్రసాద్‌ పాఠాలు చెప్పడమే కాకుండా.. క్రికెట్‌ కూడా బాగా ఆడతాడు. అంతేకాదు ‘సూపర్‌ స్టార్‌’ క్రికెట్‌ క్లబ్‌ జట్టుకు కెప్టెన్‌ కూడా. హరిప్రసాద్‌కు మదురైకు చెందిన పూజ అనే యువతితో వివాహం నిశ్చయమైంది.

ఉసిలంపాటిలోని ఓ ప్రైవేట్‌ కల్యాణ మండపంలో గత శుక్రవారం పెద్దల సమక్షంలో హరిప్రసాద్‌, పూజల పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి వరుడి క్రికెట్ స్నేహితులు అందరూ వచ్చారు. పెళ్లి తర్వాత వధువుకు ఓ షరతు విధించారు వరుడి స్నేహితులు. శని, ఆది వారాల్లో హరిప్రసాద్‌ను క్రికెట్‌ ఆడేందుకు అనుమతించాలని పెళ్లి కుమార్తెను కోరారు. ముందుగా పట్టిస్తున్నారేమో అనుకొన్న పూజ.. ఆ తర్వాత విషయం తెలుసుకుంది. చివరకు రూ. 20 బాండు పేపరు మీద ఆమె సంతకం చేయాల్సి వచ్చింది. దాంతో వరుడి స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబందించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Also Read: Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే.. ఆ రాశుల వారికి అధిక ధనవ్యయం తప్పదు!

Also Read: Asia Cup 2022 Winner: ఫైనల్లో పాకిస్తాన్‌ చిత్తు.. ఆసియా 2022 'కింగ్‌' శ్రీలంక!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News