బెంగాల్ ను ముంచెత్తిన వరదలు...జలదిగ్బంధంలో పలు ప్రాంతాలు..23 మంది మృతి

Bengal Rains: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీ వర్షాలకు వరదనీరు పోటెత్తుతోంది. ఇక వీటికి తోడు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డ్యామ్ నుంచి నీరు దిగువకు విడుదల చేయటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయి..23 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 7, 2021, 04:15 PM IST
  • పశ్చిమబెంగాల్ లో భారీ వర్షాలు
  • మూడు నదులు ఉగ్రరూపం
  • జలదిగ్బంధంలో పలు ప్రాంతాలు
  • 23 మంది మృతి, లక్షలాది మంది నిరాశ్రయులు
బెంగాల్ ను ముంచెత్తిన వరదలు...జలదిగ్బంధంలో పలు ప్రాంతాలు..23 మంది మృతి

Heavy Rains in West Bengal : కుండపోత వర్షాల(Rains)కు పశ్చిమ బెంగాల్(West Bengal) రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. మూడు నదులు ఉప్పొంగి ప్రవహస్తున్నాయి. దక్షిణ బెంగాల్ లోని హుగ్లీ(Hooghly), పుర్బా మేదినిపూర్, హౌరా(howrah), దక్షిణ పరగణాల ప్రాంతాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది.  మాల్డా జిల్లాలోని గంగా(Ganga), పుల్హార్ , మహానదుల్లో వరద ఉద్ధృతి గంటగంటకు పెరుగుతోంది.

Also Read: డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెల్టా వేరియంట్ కేసులు.. వ్యాక్సిన్ తప్పనిసరి
వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో..దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డ్యామ్(Damodar Valley Corporation Dam) నుంచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 23 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షాలాధి మంది నిరాశ్రయులయ్యారు. మూగ జీవాలు, వందలాది వాహనాలు కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్నీ నిండుకుండల్లా మారటంతో...దిగువకు నీటిని వదులుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ డ్యామ్(Damodar Valley Corporation Dam)  నుంచి 29వేల క్యూసెక్కుల వరదనీరు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

సైన్యం, ఎన్డీఆర్ఎఫ్(NDRF) సిబ్బంది రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లక్షలాది ఎకరాల పంట పొలాలు మునిగిపోయాయి. సహాయ శిబిరాల్లో వరద బాధితులకు ఆహారం అందజేశారు. మాల్డాలోని మణిక్‌చక్ ఘాట్ పాయింట్ వద్ద గంగా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. మరోవైపు, వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని శాఖల సిబ్బంది అందుబాటులో ఉండాలని సీఎం మమతా బెనర్జీ (CM Mamata Banerjee) ఆదేశించారు.

Also Read: రైతు రుణమాఫీపై కీలక ప్రకటన.. బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News