Rythu runamafi in Telangana: హైదరాబాద్: రైతు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ (Good news) చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,006 కోట్లు జమ చేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇటీవల కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు నేడు బ్యాంకర్లతో సమావేశమైన మంత్రులు రుణమాఫీ అమలు, రైతుల ఖాతాల్లో నగదు జమ తదితర అంశాలపై బ్యాంకర్లతో చర్చించారు. రుణమాఫీ మొత్తాన్ని బ్యాంకర్లు ఇతర ఖాతా కింద జమ చేయవద్దని, పూర్తిగా రుణమాఫీ ఖాతాలోనే (Loan accounts) జమ చేయాలని మంత్రులు బ్యాంకర్లకు సూచించారు.
ఈ నెల 16 నుండి రూ.50 వేల లోపు రైతుల రుణ మాఫీ పై బీఆర్కే భవన్ లో 42 బ్యాంకుల ప్రతినిధులతో సమావేశమైన వ్యవసాయ శాఖ మంత్రి @SingireddyTRS గారు , ఆర్థిక మంత్రి @trsharish గారు pic.twitter.com/fOevii3GzK
— Singireddy Niranjan Reddy (@SingireddyTRS) August 6, 2021
ఆగస్టు 16 నుంచి రైతుల ఖాతాల్లో రుణమాఫీ (Rythu runamafi) మొత్తాన్ని జమ చేయనున్నట్లు మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి స్పష్టంచేశారు. బీఆర్కేఆర్ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో 42 బ్యాంకులకు చెందిన ప్రతినిథులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రూ.50 వేల లోపు రైతుల రుణాలు మాఫీ (Farmers crop loans) కానున్నాయి.