డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెల్టా వేరియంట్ కేసులు.. వ్యాక్సిన్ తప్పనిసరి

Delta variant cases: కరోనావైరస్ సెకండ్ వేవ్‌లో ప్రస్తుతం డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే 135 దేశాలకు వ్యాపించిన డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా మారినట్టు ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా పరిశోధకులు హెచ్చరించారు. డెల్టా వేరియంట్‌ను నివారించాలంటే 80-90 శాతం మంది హెర్డ్ ఇమ్యూనిటీ (Herd immunity) పొందడమే ఒక మార్గం అని పరిశోధకులు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 6, 2021, 12:22 PM IST
డేంజర్ బెల్స్ మోగిస్తున్న డెల్టా వేరియంట్ కేసులు.. వ్యాక్సిన్ తప్పనిసరి

Delta variant cases: కరోనావైరస్ సెకండ్ వేవ్‌లో ప్రస్తుతం డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే 135 దేశాలకు వ్యాపించిన డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా మారినట్టు ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా పరిశోధకులు హెచ్చరించారు. డెల్టా వేరియంట్‌ను నివారించాలంటే 80-90 శాతం మంది హెర్డ్ ఇమ్యూనిటీ (Herd immunity) పొందడమే ఒక మార్గం అని పరిశోధకులు తెలిపారు. మరోవైపు డెల్టా వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరికలు చేస్తూనే ఉంది. 

చైనాలో సైతం డెల్టా వేరియంట్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో చైనాలోనూ డెల్టా వేరియంట్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశించిన డెల్టా వేరియంట్‌ మరో డెల్టా వైరస్‌ పుట్టడానికి కారణం అవుతున్నట్టు చైనాలోని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ అధ్యయనంలో వెల్లడైంది. కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి చెందడం ప్రారంభమైన వైరస్‌ రకంతో పోలిస్తే డెల్టా వేరియంట్ వైరల్‌ లోడ్‌ వెయ్యి రెట్లు అధికంగా ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు. అందువల్లే డెల్టా వేరియంట్ స్వల్ప వ్యవధిలో ఎక్కువ సంఖ్యలో వ్యాపిస్తున్నట్టు తెలిపారు. 

Also read : AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గిన కరోనా వైరస్ కేసులు

ఆగ్నేయాసియా దేశాల్లో డెల్టా వేరియంట్‌ (Delta plus variant) వేగంగా వ్యాపిస్తోంది. వియత్నాం, థాయిలాండ్‌, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్‌లో డెల్టా వేరియంట్‌ కేసులు భారీగా నమోదవుతున్నాయి.

Also read : కరోనా వైరస్ రక్షణకు కొత్త ఎయిర్ ఫిల్టర్, 97 శాతం రక్షణ అంటున్న హనీవెల్ కంపెనీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News