Himachal Pradesh Election Result: హిమాచల్ ప్రదేశ్‌లో హోరాహోరీ.. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ తిప్పలు

Himachal Pradesh Election Result Latest Update: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను హీటెక్కిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ వార్ నడుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఎమ్మెల్యేలకు కాపాడుకునేందుకు క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టింది ఆ పార్టీ అధిష్టానం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2022, 11:47 AM IST
  • హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికల్లో విజయం ఎవరిది..?
  • బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ వార్
  • ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించనున్న కాంగ్రెస్..?
Himachal Pradesh Election Result: హిమాచల్ ప్రదేశ్‌లో హోరాహోరీ.. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ తిప్పలు

Himachal Pradesh Election Result Latest Update: దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గుజరాత్‌లో బీజేపీ బంపర్ మెజార్టీతో విజయం దిశగా దూసుకెళ్తుండగా.. హిమాచల్ ప్రదేశ్‌లో హోరాహోరీ పోరు నెలకొంవది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆధిక్యం చేతులు మారుతోంది. హస్తం పార్టీ 39, బీజేపీ 26, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంతో కొనసాగుతున్నారు. తమకు స్వల్ప మెజార్టిటీ ఉండడంతో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్‌ను తిప్పికొట్టేందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలను క్యాంప్‌లకు తరలించే యోచనలో ఉన్నట్లు తెలిసింది.  

ఎన్నికల్లో విజయం సాధించిన తమ పార్టీ ఎమ్మెల్యేలను గురువారం సాయంత్రం బస్సుల్లో రాజస్థాన్‌కు తరలించే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.  
ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్ బఘేల్‌, పార్టీ సీనియర్‌ నేత భూపిందర్‌ సింగ్‌ హుడాలు ఎమ్మెల్యేలను ప్రత్యేక శిబిరాలను తరలించే బాధ్యతను తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. హిమాచల్ ప్రదేశ్ పరిణామాలను ప్రియాంక గాంధీ వాద్రా పర్యవేక్షిస్తున్నారు. గురువారం మధ్యాహ్నానికి ఆమె సిమ్లా చేరుకుని.. పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉంది. 

మొత్తం 68 స్థానాలున్న హిమాచల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 35 మంది సభ్యులు గెలవాలి. రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుండంతో ఫైనల్ రిజల్ట్ కోసం చివరి వరకు వేచిచూడాల్సిందే. 68 స్థానాలకు మొత్తం 412 మంది అభ్యర్థుల ఎన్నికల బరిలో నిలిచారు. మండిలోని సెరాజ్ స్థానం నుంచి సీఎం జైరామ్ ఠాకూర్ విజయం సాధించారు. కాంగ్రెస్‌కు చెందిన చేత్రం ఠాకూర్‌పై ఆయన గెలుపొందారు. ఈ రాష్ట్రంలో 1985 నుంచి ఏ అధికార పార్టీ తిరిగి అధికారంలోకి రాలేదు. అప్పటి నుంచి బద్ధ ఒకసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తున్నాయి.  

Also Read: Assembly Election Result 2022: నేడే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు.. గెలుపు ఎవరిది..?  

Also Read: IND vs BAN: వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియాకు షాక్.. ముగ్గురు ఆటగాళ్లు దూరం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News