సగం ఎత్తులో ఎగురుతున్న జాతీయ పతాకం

కరుణానిధి మృతి నేపథ్యంలో సంతాప సూచకంగా జండా కర్రకు సగం ఎత్తులో జాతీయ జండా అవనతం

Last Updated : Aug 8, 2018, 06:33 PM IST
సగం ఎత్తులో ఎగురుతున్న జాతీయ పతాకం

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మృతి నేపథ్యంలో ఆ రాజకీయ కురువృద్ధుడి గౌరవార్థం నేడు కేంద్ర ప్రభుత్వం జాతీయ సంతాప దినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా నేడు జాతీయ సంతాప దినంగా పాటిస్తున్నందున సంతాపసూచకంగా ఢిల్లీలోని పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ సహా ప్రభుత్వానికి చెందిన పలు కీలక కార్యాలయాల భవనాలపై జాతీయ పతాకాన్ని సగం ఎత్తులో ఎగురవేశారు. అదే సమయంలో నేడు సమావేశమైన పార్లమెంట్ ఉభయ సభలు తమిళ రాజకీయ దిగ్గజానికి ఘని నివాళి అర్పించాయి. కరుణానిధికి నివాళి ఘటించిన అనంతరం ఉభయ సభలు వాయిదా పడ్డాయి. 

కరుణానిధి మృతికి సంతాప సూచకంగా పార్లమెంట్‌పై జండా కర్రకు సగం ఎత్తులో జాతీయ పతాకం అవనతం

తమిళనాడుకు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ద్రవిడ ఉద్యమ నేత కరుణానిధి గత 28న అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఆయన ఆరోగ్యం మెరుగై కోలుకుంటున్నట్టు కనిపించినప్పటికీ.. మళ్లీ ఆగస్టు 6వ తేదీ నుంచి పరిస్థితి విషమించినట్టు కరుణానిధికి చికిత్స నిర్వహించిన కావేరీ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆ తర్వాత కూడా చావుతో పోరాడిన ఈ ద్రవిడ యోధుడు మంగళవారం సాయంత్రం 6:10 గంటలకు తమిళలుని విషాదంలోకి నెడుతూ తుది శ్వాస విడిచారు.

 

Trending News