బుద్ధపూర్ణిమ నాడు ఆత్మాహుతి దాడులకు ఉగ్రవాదుల కుట్ర : నిఘా వర్గాల హెచ్చరికలు

బుద్ధపూర్ణిమ నాడు ఆత్మాహుతి దాడులకు ఉగ్రవాదుల కుట్ర : నిఘా వర్గాల హెచ్చరికలు

Last Updated : May 11, 2019, 05:25 PM IST
బుద్ధపూర్ణిమ నాడు ఆత్మాహుతి దాడులకు ఉగ్రవాదుల కుట్ర : నిఘా వర్గాల హెచ్చరికలు

బుద్ధపూర్ణిమను పురస్కరించుకుని మే 18న పశ్చిమ బెంగాల్ లేదా బంగ్లాదేశ్‌లలో ఆత్మాహుతి దాడులకు పాల్పడాలని జమాత్-ఉల్-ముజిహిదీన్ బంగ్లాదేశ్, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థలు కుట్రపన్నుతున్నాయని భారత నిఘావర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. గర్భవతి వేషంలో హిందూ దేవాలయం లేదా బౌద్ధ దేవాలయంలోకి ప్రవేశించిన అనంతరం ఆత్మాహుతి దాడికి పాల్పడే విధంగా ఉగ్రవాద సంస్థలు వ్యూహరచన చేస్తున్నాయని నిఘావర్గాలు పేర్కొన్నాయి. 

నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి పశ్చిమ బెంగాల్ సర్కార్‌కి శుక్రవారం మధ్యాహ్నమే ఆదేశాలు జారీ అయ్యాయి. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని హిందు దేవాలయాలు, భౌద్ధ ఆలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు పశ్చిమ బెంగాల్ పోలీసు విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 

ఇటీవల శ్రీలంకలో ఇదే తరహాలో నిఘావర్గాలు చేసిన హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందో మనం చూశాం కనుక ఇక్కడ అలా జరిగేందుకు ఆస్కారం లేకుండా నిఘా పెంచినట్టు సదరు అధికారి పేర్కొన్నారు.

Trending News