కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన ఎం.కె. స్టాలిన్!

కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఎం.కె. స్టాలిన్ ప్రకటన 

Last Updated : Aug 3, 2018, 06:01 PM IST
కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన ఎం.కె. స్టాలిన్!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కె. స్టాలిన్ స్పందించారు. ప్రస్తుతం కరుణానిధి కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని స్టాలిన్ స్పష్టంచేశారు. కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు వెలువడిన అనంతరం డీఎంకే పార్టీ కార్యకర్తలు, కరుణానిధి అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారిని శాంతియుతంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ స్టాలిన్ ఈ ప్రకటన చేశారు. 

కరుణానిధి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని తెలిసిన వెంటనే తమిళనాడులో 21 మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు మృతిచెందడం కూడా స్టాలిన్ ఈ ప్రకటన చేసేందుకు ఓ కారణమైంది. 

Trending News