Omicron : ఒమిక్రాన్‌ వల్ల దేశంలో మళ్లీ లాక్‌డౌన్? న్యూ ఇయర్ వేడుకలు లేనట్లేనా!

Lockdown in some states soon : దేశం మొత్తం లేదా ఒమిక్రాన్ విస్తరిస్తోన్న రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తారంటూ ప్రచారం సాగుతోంది. పబ్లిక్ ప్లేస్‌లలో కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణలో ఇప్పటికే ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ వల్ల హైదరాబాద్‌లో తొలి కంటైన్మెంట్‌ జోన్ కూడా ఏర్పాటైంది.

Last Updated : Dec 17, 2021, 02:20 PM IST
  • భారత్‌లో రోజురోజుకు పెరిగిపోతున్న ఒమిక్రాన్
  • జనవరికల్లా భారీగా కేసులు
  • డెల్టా వేరియంట్‌తో పోల్చితే డెబ్భై రెట్లు వేగంగా చొచ్చుకెళ్లున్న ఒమిక్రాన్
  • డిసెంబర్ 31, జనవరి 1న లాక్‌డౌన్ విధిస్తారంటూ ప్రచారం
Omicron : ఒమిక్రాన్‌ వల్ల దేశంలో మళ్లీ లాక్‌డౌన్? న్యూ ఇయర్ వేడుకలు లేనట్లేనా!

Omicron cases rising.. Lockdown like curbs in some states soon? భారత్‌లో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జనవరికల్లా ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని నిపుణలు హెచ్చరిస్తున్నారు. పలు అధ్యయనాలు ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి. 

ప్రపంచంలో ఇప్పటికే 90కి పైగా దేశాల్లో ఒమిక్రాన్‌ కేసులు (Omicron cases) నమోదయ్యాయి. ఇప్పటి వరకు బ్రిటన్‌లో (Britain‌) తప్ప మరెక్కడా కూడా ఒమిక్రాన్ మరణాలు నమోదు కాలేదు. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌తో (Omicron variant‌) ప్రాణాలకు ప్రమాదం లేదని కొన్ని అధ్యయనాలు చెబుతోన్న ప్రముఖ శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని అంత తేలికగా తీసుకోకండి అని హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ (Omicron) ఆరోగ్య వ్యవస్థను మొత్తం దెబ్బ తీస్తుందని చెబుతున్నారు. 

అంతేకాదు.. పలువురు శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ గురించి చెబుతోన్న విషయాలివి.. ఒమిక్రాన్ వ్యాప్తి చాలా వేగంగా ఉంది. కోవిడ్‌లోని మిగతా వేరియంట్లతో పోలిస్తే ఇది చాలా భిన్నమైంది. చాలా సులభంగా వేగంగా మనిషి శరీరంలోకి చొచ్చుకెళ్లే గుణాలు ఒమిక్రాన్ వేరియంట్‌కు ఉన్నాయి. అయితే ఊపిరితిత్తుల కణజాలాల్లోకి మాత్రం కాస్త స్లోగా వెళ్తోంది. డెల్టా వేరియంట్‌తో (Delta variant‌) పోల్చితే ఇది డెబ్భై రెట్లు వేగంగా శరీరంలోకి చొచ్చుకెళ్లున్నట్లు పరిశోధల్లో తేలింది. దీంతో ఒమిక్రాన్ వేరియంట్ (Omicron variant) చాలా వేగంగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపిస్తోంది. ఇలా ఎక్కువ మందికి వ్యాపించడం వల్ల ఒమిక్రాన్ క్రమంగా ప్రమాదకరంగా మరే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న కోవిడ్ వ్యాక్సిన్‌లు (Covid vaccines) కూడా ఒమిక్రాన్‌ వేరియంట్‌పై పెద్దగా ప్రభావం చూపించడం లేదు. దీంతో ఈ కొత్త వేరియంట్‌ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. బూస్టర్‌ డోస్ వల్ల ఈ వేరియంట్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది.

Also Read : IR Camera Through Clothes: వావ్! ఈ స్మార్ట్ ఫోన్ తో లోదుస్తులను స్కాన్ చేయేచ్చు- అదెలాగో తెలుసుకోండి!

ఇక దేశంలో ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ వేరియంట్ పది రాష్ట్రాలకు పాకింది. ఢిల్లీలో తాజాగా 10 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కేసుల సంఖ్య 97కి చేరింది. మహారాష్ట్రలో (Maharashtra) భారీగా కేసులు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల పేర్కొంది. తెలంగాణలో (Telangana) మొత్తం ఒమిక్రాన్‌ కేసుల (Omicron cases) సంఖ్య 8కి చేరింది. 

దేశంలో రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో కేంద్రం మళ్లీ లాక్‌డౌన్ విధిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో కొత్త సంవత్సర వేడుకలు కూడా ప్రారంభంకావండతో ఒమిక్రాన్ మరింత విస్తరించే అవకాశం ఉంది. దీంతో డిసెంబర్ 31న, అలాగే జనవరి 1న రెండు రోజులు దేశం మొత్తం లేదా ఒమిక్రాన్ విస్తరిస్తోన్న రాష్ట్రాల్లో లాక్‌డౌన్ (Lockdown) విధిస్తారంటూ ప్రచారం సాగుతోంది. 

పబ్లిక్ ప్లేస్‌లలో కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణలో ఇప్పటికే ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ (Omicron Effect) వల్ల హైదరాబాద్‌లో తొలి కంటైన్మెంట్‌ జోన్ (Containment‌ Zone) కూడా ఏర్పాటైంది. టోలిచౌకిలో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదుకావడంతో అక్కడి పారామౌంట్‌లో (Paramount‌) కాలనీలో ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో కేంద్రం దేశంలో పాక్షికంగా లాక్‌డౌన్ విధించే అంశానికి కాస్త బలం చేకూరింది. పూర్తిగా లాకౌడౌన్ విధించకపోయినా కొన్ని ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒమిక్రాన్ (Omicron) వేగంగా విస్తరిస్తోంది కాబట్టి జాగ్రత్తలు పాటించడం మేలు.

Also Read : Manasa Varanasi Corona: 'మిస్ ఇండియా'కు కరోనా పాజిటివ్- మిస్ వరల్డ్ పోటీలు వాయిదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News