Ram Nath Kovind: రాష్ట్రపతిగా మూడేళ్లు పూర్తి

భారత రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ( Ram Nath Kovind ) మూడేళ్ల పదవీకాలాన్ని శనివారంతో పూర్తి చేసుకున్నారు. రామ్‌నాథ్ కోవింద్ భారత 14వ రాష్ట్రపతిగా 2017 జూలై 25న పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ మూడేళ్ల కాలంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు.. ఎంతోమందితో భేటి అయిన రాష్ట్రపతిగా నిలిచారు.

Last Updated : Jul 26, 2020, 10:19 AM IST
 Ram Nath Kovind: రాష్ట్రపతిగా మూడేళ్లు పూర్తి

President ram nath kovind: న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ( Ram Nath Kovind ) మూడేళ్ల పదవీకాలాన్ని శనివారంతో పూర్తి చేసుకున్నారు.రామ్‌నాథ్ కోవింద్ భారత 14వ రాష్ట్రపతిగా 2017 జూలై 25న పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ మూడేళ్ల కాలంలో ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు.. ఎంతోమందితో భేటి అయిన రాష్ట్రపతిగా నిలిచారు. దేశ ప్రథమ పౌరుడిగా కరోనాపై పోరాటంలో రామ్‌నాథ్ కోవింద్ ప్రజలకు మార్గదర్శకులయ్యారని రాష్ట్రపతి భవన్ ( rashtrapati bhavan ) ట్వీట్‌ ద్వారా వెల్లడించింది. కరోనా సంక్షోభ సమయంలో కూడా ఆయన వేలాది మంది సైనికులు, శాస్త్రవేత్తల్ని, ప్రజాప్రతినిధులను కోవింద్‌ కలిశారని వెల్లడించింది. ఈ మూడేళ్ల కాలంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, కరోనాపై సంక్షోభ సమయంలో తీసుకున్న చొరవ, ప్రదర్శించిన మానవత్వం గురించి రాష్ట్రపతి భవన్‌ ప్రధానంగా వివరించింది. Also read: Pragya Thakur: ‘హనుమాన్‌ చాలీసా పఠించండి.. కరోనాను జయించండి’

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. కరోనాపై పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌కి ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఏడాదిపాటు 30% జీతాన్ని స్వచ్ఛందంగా వదులుకోని ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచారు. కరోనా కట్టడిపై డిజిటల్ సదస్సుల ద్వారా ఆయన ఉపరాష్ట్రపతి, అన్ని రాష్ట్రాల గవర్నర్లతో మాట్లాడారు. ఇప్పటివరకు ఆయన ఏడు రాష్ట్రాల్లో పర్యటించారు. అయితే ఇప్పటివరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. పార్లమెంటు పాస్‌ చేసిన 48 బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వాల 22 బిల్లుల్ని ఆమోదించారు. 13 ఆర్డినెన్స్‌లు జారీ చేశారు. 11 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు. Also read: IIT Kharagpur: రూ.400లకే కరోనా టెస్టు..

ఇదిలా ఉంటే.. రాష్ట్రపతిగా మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుసుకున్న రామ్‌నాథ్ కోవింద్‌కు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (vice president venkaiah naidu) శుభాకాంక్షలు చెప్పారు. దేశ అభివృద్ధి విషయంలో.. పలు నిర్ణయాల్లో కోవింద్‌తో కలిసి పని చేస్తుండటం గొప్ప అనుభూతినిస్తోందని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ట్విట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.  Also read: Apple: భారత్‌లో ఐఫోన్‌ 11 ఉత్పత్తి ప్రారంభం

Trending News