Rafale fighter jets: జాతికి అంకితం కానున్న రఫేల్ యుద్ధ విమానాలు

రఫేల్ యుద్ధ విమానాలను ( Rafale jets ) అంబాలలో మొహరించేందుకు సర్వం సిద్ధమైంది. రేపు గురువారం ఉదయం 10 గంటలకు హర్యానాలోని అంబాలలో ఉన్న వైమానిక స్థావరంలో రఫేల్ యుద్ధ విమానాలను మొహరించడం ద్వారా ఆ యుద్ధ విమానాలను జాతికి అంకితం చేయనున్నారు.

Last Updated : Sep 9, 2020, 11:09 PM IST
Rafale fighter jets: జాతికి అంకితం కానున్న రఫేల్ యుద్ధ విమానాలు

న్యూ ఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాలను ( Rafale jets ) అంబాలలో మొహరించేందుకు సర్వం సిద్ధమైంది. రేపు గురువారం ఉదయం 10 గంటలకు హర్యానాలోని అంబాలలో ఉన్న వైమానిక స్థావరంలో రఫేల్ యుద్ధ విమానాలను మొహరించడం ద్వారా ఆ యుద్ధ విమానాలను జాతికి అంకితం చేయనున్నారు. అంబాలలోని గోల్డెన్ ఆరోస్ 17 స్క్వాడ్రాన్‌లో భాగంగా ఈ రఫేల్ యుద్ధ విమానాలు సేవలు అందించనున్నాయి. రఫేల్ యుద్ధ విమానాల ( Rafale aircrafts ) కొనుగోలును గత రెండున్నర దశాబ్ధాల కాలంలో భారత్ కొనుగోలు చేసిన అతి శక్తిమంతమైన యుద్ధ విమానాల కొనుగోలుగా, ముఖ్యమైన ఒప్పందంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ( Defence minister Rajnath Singh ) అభివర్ణించారు. Also read : Rohit Sharma's six hits bus: రోహిత్ శర్మ కొట్టిన సిక్సర్ షాట్‌కి బస్సుకి తగిలిన బాల్

అంబాలలో జరగనున్న ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లి ( Florence Parly ), డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఐఏఎఫ్ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా, రక్షణ శాఖ కార్యదర్శి డా అజయ్ కుమార్, డీఆర్డీడీఓ చైర్మన్ జి సతీష్ రెడ్డి, తదితరులు ముఖ్య అతిథిలుగా హాజరుకానున్నారు. Also read : TV actress Sravani suicide case: టీవీ నటి శ్రావణి ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది ?

ఫ్రాన్స్‌తో భారత్ చేసుకున్న ఒప్పందంలో భాగంగా జూలై 29న ఐదు రఫేల్ యుద్ధ విమానాలు అంబాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌లోని డసాల్ట్ రఫేల్ ఏవియేషన్ సంస్థ తయారు చేసిన ఈ రఫేల్ యుద్ధ విమానాలను భారత వైమానిక దళానికి చెందిన పైలట్స్ ( IAF pilots ) ఫ్రాన్స్ నుంచి భారత్‌కి తీసుకొచ్చారు. Also read : Astrazeneca vaccine: ఇండియాలో పరీక్షలు కొనసాగుతున్నాయి: సీరమ్

Trending News