Unlock-4: పట్టాలెక్కిన మరో 80 ప్రత్యేక రైళ్లు.. ఫుల్ లిస్ట్ ఇదే

కరోనావైరస్ కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మార్చిలో కరోనా లాక్‌డౌన్ ప్రకటించిన నాటినుంచి రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సడలింపుల మేరకు 230 కొవిడ్ స్పెషల్ రైళ్లను రైల్వేశాఖ ప్రయాణికుల కోసం నడిపించింది.

Last Updated : Sep 12, 2020, 07:50 AM IST
Unlock-4: పట్టాలెక్కిన మరో 80 ప్రత్యేక రైళ్లు.. ఫుల్ లిస్ట్ ఇదే

Railways to run 80 new special trains: న్యూఢిల్లీ: కరోనావైరస్ (Coronavirus) కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మార్చిలో కరోనా లాక్‌డౌన్ ప్రకటించిన నాటినుంచి రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సడలింపుల మేరకు 230 కొవిడ్ స్పెషల్ రైళ్లను (special trains) రైల్వేశాఖ ప్రయాణికుల కోసం నడిపించింది. అయితే తాజాగా అన్‌లాక్‌ 4.0లో భాగంగా మరో 80 ప్రత్యేక రైళ్లు శనివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ముఖ్యమైన స్టేషన్ల మధ్య 230 రైళ్లు నడుపుతున్న రైల్వేశాఖ.. మరో 80 రైళ్లను నడిపేందుకు చర్యలు చేపట్టి ఈ రోజు ఉదయం నుంచి సర్వీసులను ప్రారంభించింది. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ కొన్నిరోజుల క్రితం.. నడిచే రైళ్ల సర్వీసుల వివరాలను సైతం వెల్లడించింది.  Also read: Kim Jong-un: నార్త్ కొరియాలో అరాచకం.. కరోనా వ్యాపించకుండా కాల్చివేత ఉత్తర్వులు!

ఈ సర్వీస్‌లలో ఎనిమిది డైలీ, వీక్లీ ట్రైన్లు తెలంగాణ, ఏపీ నుంచి ఢిల్లీ, చెన్నై, ఓకా, దర్భంగా సహా దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఉన్నాయి. అయితే ఈ రైళ్లన్నింటికీ గురువారం నుంచే టికెట్ల బుకింగ్‌ను సైతం రైల్వేశాఖ ప్రారంభించింది. ఇప్పటికే ఢిల్లీ సహా పలునగరాల్లో మెట్రోసర్వీసులకు కూడా కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మరో 80 ప్రత్యేక రైళ్లను కేంద్రం ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.   Also read: Ketika Sharma: కేతిక అందాలు అదరహో..

Trending News