Rajinikanth: రజినీకాంత్‌పై ఆగ్రహం వ్యక్తంచేసిన మద్రాస్ హైకోర్టు

తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth) పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడంపై మద్రాస్ ధర్మాసనం ( Madras High Court) రజనీకాంత్‌పై అసంతృప్తి వ్యక్తంచేస్తూ మందలించింది.

Last Updated : Oct 14, 2020, 02:16 PM IST
Rajinikanth: రజినీకాంత్‌పై ఆగ్రహం వ్యక్తంచేసిన మద్రాస్ హైకోర్టు

Madras High Court warns Rajinikanth: చెన్నై: తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Rajinikanth) పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడంపై మద్రాస్ ధర్మాసనం ( Madras High Court) రజనీకాంత్‌పై అసంతృప్తి వ్యక్తంచేస్తూ మందలించింది. అయితే గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ తన పంక్షన్ హాల్‌కు 6.5 లక్షల రూపాయల ఆస్తి పన్ను ( Property tax) విధించడంపై నటుడు రజినీకాంత్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన రిట్ పిటిషన్‌ను దాఖలు చేశారు. చెన్నైలోని తన ఆస్థి అయిన రాఘవేంద్ర కల్యాణ మండపానికి సంబంధించి 6.5లక్షల పన్ను చెల్లించాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నోటీసులు పంపింది. అయితే కరోనా కారణంగా మార్చిలో విధించిన లాక్‌డౌన్ నాటినుంచి రాఘవేంద్ర కల్యాణ మండపం మూసివేసి ఉందని, అప్పటి నుంచి ఎలాంటి ఆదాయం లేనందున గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ విధించిన ఆస్తి పన్ను చెల్లించలేమని.. ఈ మిషయంపై సెప్టెంబర్ 23న కార్పొరేషన్‌కు రజనీకాంత్ నోటీసు పంపారని రజినీ తరపు లాయర్ మద్రాస్ హైకోర్టుకు తెలిపారు. Also read: Hyderabad Rains: నగరంలో ఎటుచూసినా నీరే.. హెల్ప్ లైన్ నెంబర్ల జారీ

అయితే రజనీకాంత్ పిటిషన్‌పై బుధవారం మద్రాస్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా ధర్మాసనాన్ని ఆశ్రయించడంపై మద్రాస్ హైకోర్టు జడ్జి అనిత సుమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పన్నును చెల్లించకుండా దానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించినందుకు జరిమానా విధించాల్సి ఉంటుందని రజినీని కోర్టు హెచ్చరించింది. అయితే ఈ కేసును ఉపసంహరించుకోవడానికి తమకు కొంత సమయం కావాలని రజినీకాంత్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు.  

  • Also Read : Shobha Naidu Passed Away: ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ శోభానాయుడు కన్నుమూత
  • స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
    Android Link - https://bit.ly/3hDyh4G

    Apple Link - https://apple.co/3loQYe

Trending News