'కరోనా వైరస్'పై సేఫ్ హ్యండ్స్ ఛాలెంజ్

'కరోనా వైరస్' నుంచి తప్పించుకోవాలంటే .. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ప్రభుత్వాలు, సినిమా స్టార్లు, రాజకీయ నాయకులు.. ఇదే ప్రచారం చేస్తున్నారు. సామాన్య జనానికి కరోనా వైరస్ పై  అవగాహన కల్పిస్తున్నారు.

Last Updated : Mar 18, 2020, 11:45 AM IST
'కరోనా వైరస్'పై సేఫ్ హ్యండ్స్ ఛాలెంజ్

'కరోనా వైరస్' నుంచి తప్పించుకోవాలంటే .. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ప్రభుత్వాలు, సినిమా స్టార్లు, రాజకీయ నాయకులు.. ఇదే ప్రచారం చేస్తున్నారు. సామాన్య జనానికి కరోనా వైరస్ పై  అవగాహన కల్పిస్తున్నారు.

మొన్న హీరో విజయ్ దేవరకొండ.. నిన్న రామ్ చరణ్,  జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు కూడా 'కరోనా వైరస్'పై పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులు కూడా రంగంలోకి దిగారు. ఇప్పుడు స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సైతం.. కరోనాపై అవగాహన కోసం ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే కాదు #safehandschallenge పేరుతో ఓ ఛాలెంజ్ విసిరారు. ఇప్పుడీ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని వీడియోలో సూచించింది. అంతే కాదు #safehandschallenge ను కేంద్ర మంత్రి రిజుజుతోపాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాకు ఛాలెంజ్ విసిరింది. 

Read Also: అన్ని హ్యాండ్ శానిటైజర్‌లు ఒకేలా ఉండవు..!!

ఇందులో కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు.. పీవీ సింధు ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఆయన కూడా చేతులు శుభ్రంగా కడుక్కుంటున్న వీడియో  తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాదు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మానికా బాత్రా, సింగర్ అద్నన్ సమీకి ఛాలెంజ్ విసిరారు.

Read Also: గో.. కరోనా.. గో .. కరోనా..   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.

Trending News