coronavirus: అన్ని హ్యాండ్ శానిటైజర్‌లు ఒకేలా ఉండవు..!!

'కరోనా వైరస్' ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. వైరస్ ఎఫెక్ట్ కారణంగా 140 దేశాలు స్వచ్ఛత, శుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రజల్లోనూ వ్యక్తిగత పరిశుభ్రత పెరిగింది. ఎక్కడ చూసినా.. చేతులు శుభ్రంగా కడుక్కోండి.. వైరస్ దాడి బారి నుంచి తప్పించుకోండి అనే ప్రకటనలు, అవగాహన కార్యక్రమాలు కనిపిస్తున్నాయి.

Last Updated : Mar 16, 2020, 02:38 PM IST
coronavirus: అన్ని హ్యాండ్ శానిటైజర్‌లు ఒకేలా ఉండవు..!!

'కరోనా వైరస్' ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. వైరస్ ఎఫెక్ట్ కారణంగా 140 దేశాలు స్వచ్ఛత, శుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రజల్లోనూ వ్యక్తిగత పరిశుభ్రత పెరిగింది. ఎక్కడ చూసినా.. చేతులు శుభ్రంగా కడుక్కోండి.. వైరస్ దాడి బారి నుంచి తప్పించుకోండి అనే ప్రకటనలు, అవగాహన కార్యక్రమాలు కనిపిస్తున్నాయి.  

'కరోనా వైరస్' వ్యాప్తిని అరికట్టాలంటే. . చేతులు కడుక్కోవడం లేదా హ్యాండ్ శానిటైజర్ వాడడం తప్పనిసరి అయిపోయింది. దీంతో హ్యాండ్ శానిటైజర్‌లకు గిరాకీ బాగా పెరిగింది. ఇండియాతోపాటు  ప్రపంచవ్యాప్తంగా హ్యాండ్ శానిటైజర్‌లకు కొరత ఏర్పడుతోంది. నిజానికి హ్యాండ్ శానిటైజర్‌లు ఇన్ఫెక్షన్‌ను తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తాయి. ఇది ఎవరూ కొట్టిపారేయలేనిది. ఐతే  అన్ని హ్యాండ్ శానిటైజర్‌లు అంతే సమానంగా కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ప్రభావం చూపలేవు. 

Read Also: 'కమలం'పై కేసీఆర్ కన్నెర్ర

సబ్బు, నీళ్లు లేనప్పుడు హ్యాండ్ శానిటైజర్‌లను సూక్ష్మ క్రిముల నుంచి తప్పించుకోవడానికి ఉపయోగిస్తారు. హ్యాండ్ శానిటైజర్‌లలో రెండు రకాలు ఉన్నాయి. అవి ఆల్కహాల్ ఆధారితంగా పని చేసేవి. ఆల్కహాల్ లేకుండా తయారు చేసినవి. ఆల్కహాల్ ఆధారితంగా రూపొందించిన వాటిలో మళ్లీ రకాలు ఉన్నాయి. వాటిలో 60 శాతం ఆల్కహాల్ వాడేవి, 95 శాతం ఆల్కహాల్ వాడేవి. వాటిలో సాధారణంగా ఇసో ప్రొపైల్ ఆల్కహాల్, ఇథనాల్ వాడతారు. 

'కరోనా' తగ్గిస్తానంటున్న 'కంత్రీ బాబా'

ఆల్కహాల్ లేని వాటిలో.. అమ్మోనియా వాడతారు. ఇవి కూడా సూక్ష్మ క్రిములను అడ్డుకోవడంలో బాగానే పని చేస్తాయి. కానీ ఆల్కహాల్ శానిటైజర్‌ల కంటే వీటి ప్రభావం తక్కువగా ఉంటుంది. ఆల్కహాల్‌తో తయారు చేసిన హ్యాండ్ శానిటైజర్‌లు MRSA, ఈ-కొలి లాంటి బ్యాక్టీరియాలతోపాటు ఇన్ఫ్లూయెంజా, రైనో వైరస్, హెపటైటిస్ A,HIV లాంటి వైరస్‌లపై ప్రభావవంతంగా పని చేస్తాయి. 

ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌లు వైరస్ చుట్టూ ఉన్న ప్రొటీన్‌పై దాడి చేస్తాయి. కానీ ఆల్కహాల్ కనీసం 60 శాతం ఉండాలి. 60 శాతం కంటే తక్కువ ఉన్న హ్యాండ్ శానిటైజర్‌ల వల్ల ఎలాంటి  ఉపయోగం లేదు. అందుకే హ్యాండ్ శానిటైజర్ కొనుగోలు చేసేటప్పుడు లేబుల్‌పై జాగ్రత్తగా గమనించి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.  Read Also: తెలంగాణలో మూడో కరోనా కేసు  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News