10th class students: 10వ తరగతి వాట్సాప్ గ్రూపులో బూతు వీడియోలు

కరోనావైరస్ వ్యాప్తిని ( Coronavirus pandemic ) నివారించేందుకు కేంద్రం విద్యా సంస్థలు మూసివేయడంతో ప్రస్తుతం విద్యా సంస్థలన్నీ తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు ( Online classes ) చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పిల్లలకు ఫోన్స్ ఇవ్వడానికి జంకిన తల్లిదండ్రులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్‌లైన్ క్లాసెస్ హాజరవడం కోసం స్మార్ట్ ఫోన్స్ ( Smart phones ) కొని పిల్లల చేతుల్లో పెడుతున్నారు.

Last Updated : Sep 8, 2020, 12:55 AM IST
10th class students: 10వ తరగతి వాట్సాప్ గ్రూపులో బూతు వీడియోలు

కరోనావైరస్ వ్యాప్తిని ( Coronavirus pandemic ) నివారించేందుకు కేంద్రం విద్యా సంస్థలు మూసివేయడంతో ప్రస్తుతం విద్యా సంస్థలన్నీ తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు ( Online classes ) చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పిల్లలకు ఫోన్స్ ఇవ్వడానికి జంకిన తల్లిదండ్రులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్‌లైన్ క్లాసెస్ హాజరవడం కోసం స్మార్ట్ ఫోన్స్ ( Smart phones ) కొని పిల్లల చేతుల్లో పెడుతున్నారు. దీంతో కొంతమంది విద్యార్థులు ఆ స్మార్ట్ ఫోన్స్‌ని చదువు కోసం కాకుండా.. అశ్లీల వీడియోలు ( Vulgar videos, pornographic content ) చూసేందుకు, అశ్లీల చాటింగ్స్ (  చేసేందుకు ఉపయోగించుకుంటున్న ఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటున్నాయి. కర్నూలులో ఇటీవల స్కూల్ వాట్సాప్‌ గ్రూపులో పోర్న్ వీడియోలు ప్రత్యక్షమైన ఘటన ఎంత కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. అలాంటి ఘటనే ఒకటి తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగుచూసింది. Also read : Gangavva in BB4: బిగ్ బాస్ రియాలిటీ షోలో గంగవ్వ డైలాగ్స్ కెవ్వు కేక

10వ తరగతి విద్యార్థులు Biology group Class 10 పేరిట ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులో ఓ విద్యార్థి అశ్లీల వీడియోలు ( Pornographic content ) పోస్ట్ చేయడమే కాకుండా ఆ వాట్సాప్ గ్రూప్ డిస్ప్లే పిక్‌గా తమ బయాలజీ టీచర్‌ ఫోటోను సైతం పెట్టుకున్న ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని భాగ్‌పత్‌లో చోటుచేసుకుంది. అంతటితో ఊరుకోని విద్యార్థులు ఆ వాట్సాప్ గ్రూపులో అసభ్యకరమైన రీతిలో చాటింగ్ సైతం చేశారు. Also read : Vakeel Saab on OTT: ఓటీటీలో వకీల్ సాబ్ ?

భాగ్‌పత్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. టెన్త్ క్లాస్ చదువుతున్న ఓ విద్యార్థి ఇంటర్నేషనల్ ఫోన్ నంబర్‌తో బయోలజీ వాట్సాప్ గ్రూపు ( Students whatsapp group ) క్రియేట్ చేశాడు. ఆదివారం వాటిలో అశ్లీల వీడియోలు ( Explicit content ) పోస్ట్ చేయడంతో పాటు బయోలజీ టీచర్ ఫోటోలు కూడా పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఓ ఫోటో, వీడియోలపై కొంత అసభ్యకరమైన చాటింగ్ కూడా జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్‌కు ( School principal ) ఓ విద్యార్థి సమాచారం అందించే వరకు ఇది ఎవ్వరికీ తెలియలేదు. విద్యార్థి ఇచ్చిన సమాచారంతో జరిగిన విషయం గురించి తెలుసుకున్న ప్రిన్సిపల్.. వ్యవహారం చేయిదాటిపోక ముందే పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also read :  Prabhas adopts forest land: అటవీ భూమిని దత్తత తీసుకున్న హీరో ప్రభాస్

స్కూల్ ప్రిన్సిపల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఉత్తర ప్రదేశ్ సైబర్ క్రైమ్ పోలీసులు ( Cyber crime police ) విచారణ చేపట్టారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది ఇంటర్నేషనల్ నెంబర్‌తోనే అయినప్పటికీ.. ఇది కచ్చితంగా స్కూల్ విద్యార్థులకు బాగా తెలిసిన వారి పనే అయ్యుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బయాలజీ టీచర్ ఫోటోతో ( Biology teacher photos ) పాటు విద్యార్థులు అందరి ఫోన్ నెంబర్స్ ఈ వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నాయంటే.. దీనివెనుక ఎవరో బాగా తెలిసిన వారి హస్తం ఉందని పోలీసులు ఓ నిర్ణయానికొచ్చారు. యూపీలో చోటుచేసుకున్న ఈ ఘటన ఢిల్లీలో వెలుగుచూసిన బాయ్స్ లాకర్ రూమ్ ఘటనను ( Bois Locker Room case ) గుర్తుచేసింది. Also read : SP Balasubrahmanyam: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులకు గుడ్ న్యూస్

Trending News