Gangavva in BB4: బిగ్ బాస్ రియాలిటీ షోలో గంగవ్వ డైలాగ్స్ కెవ్వు కేక

తెలుగులో అతి పెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 4 ( Bigg Boss Telugu 4 ) కరోనా భయాలను పక్కన పెట్టి ప్రేక్షకులను అలరించడానికి 16 మంది కంటెస్టెంట్స్‌తో ( Bigg boss 4 Telugu contestants ) ఆదివారం సాయంత్రం గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి యువ సెలెబ్రిటీలనే కాకుండా మై విలేజ్‌ షోతో ( My village show ) పాపులరైన గంగవ్వను ( Gangavva ) కూడా ఆహ్వానించింది.

Last Updated : Sep 7, 2020, 10:13 PM IST
Gangavva in BB4: బిగ్ బాస్ రియాలిటీ షోలో గంగవ్వ డైలాగ్స్ కెవ్వు కేక

తెలుగులో అతి పెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 4 ( Bigg Boss Telugu 4 ) కరోనా భయాలను పక్కన పెట్టి ప్రేక్షకులను అలరించడానికి 16 మంది కంటెస్టెంట్స్‌తో ( Bigg boss 4 Telugu contestants ) ఆదివారం సాయంత్రం గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి యువ సెలెబ్రిటీలనే కాకుండా మై విలేజ్‌ షోతో ( My village show ) పాపులరైన గంగవ్వను ( Gangavva ) కూడా ఆహ్వానించింది. గంగవ్వ వచ్చీరాగానే ఇంటా, బయటా అభిమానులను సంపాదించుకుంది. ఇంతకు ముందు బిగ్‌బాస్‌ షో చూడనివారు సైతం, ఈసారి గంగవ్వ కోసం చూస్తామని, ఆమెకు సపోర్ట్ చేస్తామని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటే ఆమెకు ఉన్న క్రేజ్ ఏంటో ఇట్టే అర్థమైపోతోంది. Also read : Vakeel Saab on OTT: ఓటీటీలో వకీల్ సాబ్ ?

ఇక సోమవారం ఉదయం విడుదలైన ప్రోమో చూస్తే బిగ్ బాస్ హౌజ్‌లో తొలి ఎలిమినేషన్‌ ప్రక్రియ గురించి ప్రస్తావన రాగా.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన గంగవ్వ నామినేషన్ గురించి చెప్పిన డైలాగ్ ( Gangavva on elimination nomination) అందరినీ ఆకట్టుకుంటోంది. నామినేట్‌ చేయాలనుకునే సభ్యుల పేర్లను చెప్పి, వారి మొహం మీద కిటీకి మూసేయాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. సభ్యులందరిలో నామినేషన్‌ ఎదుర్కొనేందుకు చివరికి అభిజిత్‌ ( Abhijit ), దేత్తడి హారిక ( Dethadi Harika ) మిగిలిపోయారు.

 

ఐతే, ఆ ఇద్దరిలో ఎవరిని నామినేట్ చేస్తావు అని జోర్దార్‌ సుజాత ( Jordar Sujatha ), యాంకర్‌ లాస్య ( Anchor Lasya ) గంగవ్వను అడగగా..  '' యెవ్వలెందుకు మొన్ననే వచ్చిరి. ఆల్లిద్దరూ ఉండనీ'' అని గంగవ్వ చెప్పిన సమాధానం ఆమె మనస్తత్వానికి, అమాయకత్వానికి అద్దం పట్టింది. గంగవ్వ సమాదానంతో హౌజ్‌లో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ఘొల్లుమన్నారు. Also read : Prabhas adopts forest land: అటవీ భూమిని దత్తత తీసుకున్న హీరో ప్రభాస్

Trending News