ఆన్‌లైన్‌లోనే సింపుల్‌గా ఆధార్ కార్డు మార్పు చేర్పులు

                          

Last Updated : Aug 2, 2018, 02:12 PM IST
ఆన్‌లైన్‌లోనే సింపుల్‌గా ఆధార్ కార్డు మార్పు చేర్పులు

ఆధార్‌.. ఇప్పుడు అందరికీ ఇదే ఆధారంగా మారింది...ఏ చిన్న ప‌ని కావాల‌న్నా ఆధార్ క‌చ్చితంగా అవ‌స‌రం అవుతోంది. ఫొటో ఐడీ గా, అడ్రస్ ఫ్రూఫ్ కోసం, ప్రభుత్వ సంక్షే పథకాల కోసం..ఇలా  దీన్ని చాలా ర‌కాలుగా మనం వాడుకుంటుకున్నాం. అంతటి కీలకమైన ఆధార్ కార్డుల్లో పేరు, చిరునామా వంటి వాటిలో త‌ప్పులు ఉన్నా.. లేదంటే కార్డులో ఉన్న చిరునామా కాకుండా వేరే అడ్రస్ ఉంటే దీంతో ఏర్పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.  మార్పు చేర్పుల కోసం స్థానికంగా ఉన్న ఆధార్ కేంద్రంలో అపాయింట్ మెంట్ తీసుకొని.. క్యూలో గంటల తరబడి నిలబడి మరి అప్ డేట్ చేయించుకోవాల్సిన పరిస్థితి.  ఇక నుంచి ఇలాంటి కష్టాలు ఉండక పోవచ్చు. దీని గురించి తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

అప్ డేట్ నిబంధనల్లో మార్పులు

జనాల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని  భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆధార్ అప్ డేట్ నిబంధనల్లో మార్పులు చేసింది. తాజా మర్పులను అనుసరించి ఆధార్ కార్డులో మార్చుచేర్పుల కోసం ఇక నుంచి ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఆన్ లైన్ ద్వార దీన్ని అప్ డేట్ చేసుకునే వెసులుబాటు కల్పిచేందుకు రంగం సిద్ధమైంది. ఇంట్లో కూర్చుని ఆన్ లైన్ ద్వారా తమ ఆధార్ కార్డులోని అడ్రస్ తదితర వివరాలు మార్చుకోవచ్చు. ఈ మేరకు యూఐడీఏఐ ప్రకటన విడుదల చేసింది. 

అప్ డేట్ చేసుకోండిలా... 
ఆధార్ అప్ డేట్ చేసుకునే ప్రక్రియలో భాగంగా యూఐడీఏఐ ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన పిన్ జారీ చేస్తుంది. బ్యాంకులు తమ ఖాతాదారులకు డెబిట్, క్రెడిట్ కార్డు పిన్ నంబర్లను లెటర్ లో ఇచ్చినట్లుగా...ప్రత్యేకమైన పిన్ ను సంబంధిత  వ్యక్తులకు లేఖ ద్వార పంపిస్తారు. కాగా ఈ ప్రాజెక్టును 2019 జనవరిలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామన్నారు. ఫలితాలను పరిశీలించి అదే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. ఆధార్ లో మార్పుచేర్పుల కోసం తమకు పిన్ పంపాలని ప్రజలు  యూఐడీఏఐని కోరవచ్చని సంబంధిత అధికారి తెలిపారు. 

ఉద్యోగంలో భాగంగా వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అవుతున్న వారు..ఉపాధి కోసం మరోచోటికి వెళ్లి స్థిరపడ్డవారు ఆధార్ కార్డులో అడ్రస్ మార్పుకు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని యూఐడీఏఐ ఈ మేరకు మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది.

Trending News