West Bengal Elections:పశ్చిమ బెంగాల్‌లో 5 రూపాయలకే భోజనం పథకం ప్రారంభించిన మమతా బెనర్జీ

West Bengal Elections: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోసారి అధికారం దక్కించుకునేందుకు మమతా బెనర్జీ..గద్దె దించేందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. టీఎంసీ సరికొత్త పథకానికి అంకురార్పణ చేసింది.  

Last Updated : Feb 15, 2021, 10:05 PM IST
  • పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాస్త్రాల్ని సిద్దం చేసుకుంటున్న అధికార , విపక్ష పార్టీలు
  • తాయిలాలు అందిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
  • పేదల కోసం 5 రూపాయలకే భోజన పథకం ప్రారంభించిన మమతా బెనర్జీ
West Bengal Elections:పశ్చిమ బెంగాల్‌లో 5 రూపాయలకే భోజనం పథకం ప్రారంభించిన మమతా బెనర్జీ

West Bengal Elections: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోసారి అధికారం దక్కించుకునేందుకు మమతా బెనర్జీ..గద్దె దించేందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. టీఎంసీ సరికొత్త పథకానికి అంకురార్పణ చేసింది.

పశ్చిమ బెంగాల్ ( West Bengal )రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. మరో 2-3 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నిక ( Assembly Elections )ల్లో నువ్వా నేనా రీతిలో పోటీ ఉండటం ఖాయం. అధికార పార్టీ టీఎంసీ, బీజేపీ మధ్య పోటీ తీవ్రంగా ఉండబోతుందన్న అంచనాలున్నాయి. మరోసారి అధికారం చేపట్టేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయత్నిస్తుంటే..మమతాను గద్దె దింపి అధికారం కైవసం చేసుకునేందుకు బీజేపీ ( BJP) ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో పేదల ఓట్లపై కన్నేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరికొత్త పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 5 రూపాయలకే భోజనం పథకానికి శ్రీకారం చుట్టారు. మా , మట్టి, మనుష్, అనే టీఎంసీ నినాదం నుంచి పధకాన్ని అంకురార్పణ జరిగినట్టు టీఎంసీ ( TMC ) నేతలు చెబుతున్నారు. 

మద్యాహ్న భోజనంగా అన్నం, పప్పు, కూరగాయలు, గుడ్డు కూర కలిపి కేవలం 5 రూపాయలకే  ( 5 Rupees Meals ) అందించనున్నారు. ప్రతిరోజూ మద్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకూ స్వయం సహాయక బృందాలు వంటశాలల్ని నిర్వహిస్తాయని మమతా బెనర్జీ ( Mamata Banerjee )తెలిపారు. క్రమంగా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో ఇలాంటి వంటశాలలు ఏర్పాటు చేయనున్నామని మమతా వెల్లడించారు. ప్రజలకు ఉచిత ఆరోగ్య సంరక్షణ, ఉచిత విద్యను అందించే ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని మమతా బెనర్జీ తెలిపారు. దేశంలో ఆరోగ్య రంగంలో బెంగాల్ మొదటి స్థానంలో ఉందని..అవసరమైన మౌళిక సదుపాయాల్ని సైతం ప్రభుత్వం అభివృద్ధి చేసిందని చెప్పారు.

Also read: Farmers protest: రైతు ఉద్యమం మరింత ఉధృతం, 18న దేశవ్యాప్తంగా రైల్ రోకో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News