GRAND ICT Challenge: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఛాలెంజ్ పూర్తి చేస్తే.. రూ.50 లక్షలు మీకే సొంతం

కేంద్ర ప్రభుత్వం ( Government ) ప్రజలకు రూ.50 లక్షలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది.

Last Updated : Sep 19, 2020, 11:23 PM IST
    • కేంద్ర ప్రభుత్వం ప్రజలకు రూ.50 లక్షలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది.
    • ఈ డబ్బును సొంతం చేసుకోవడానికి ప్రజలు ఐసిటీ ఛాలెంజ్ లో పాల్గొనాల్సి ఉంటుంది.
    • ఈ ఛాలెంజ్ ను పూర్తి చేయడానికి మీరు నీటిని కొలిచి, పర్యవేక్షించే ఒక వ్యవస్థను మీరు డెవలెప్ చేయాల్సి ఉంటుంది.
    • ఈ సిస్టం ను గ్రామల్లో బిగించనున్నారు.
GRAND ICT Challenge: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఛాలెంజ్ పూర్తి చేస్తే.. రూ.50 లక్షలు మీకే సొంతం

కేంద్ర ప్రభుత్వం ( Government ) ప్రజలకు రూ.50 లక్షలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ డబ్బును సొంతం చేసుకోవడానికి ప్రజలు ఐసిటీ ఛాలెంజ్ ( Grand ICT Challenge ) లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్ ను పూర్తి చేయడానికి మీరు నీటిని కొలిచి, పర్యవేక్షించే ఒక వ్యవస్థను  డెవలెప్ చేయాల్సి ఉంటుంది. ఈ సిస్టం ను గ్రామల్లో బిగించనున్నారు.

ALSO READ | IPL 2020: ఐపీఎల్ లో మనం మిస్సయ్యే టాప్ 5 విషయాలివే

రాష్ట్రీయ జల జీవన్ మిషన్ తో కలిసి ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచారా మంత్రాలయం ( Meity) ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. స్మార్ట్ వాటర్ సప్లై మెజర్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (Smart Water Supply Measurement and Monitoring System) ను డిజైన్ చేయడానికి భారతీయ స్టార్ట్ యాప్,  ఎమ్మెస్ ఎమ్ ఈ ( MSME )  లు లేదా ఇతర భారత కంపెనీలు కూడా  ఈ ఛాలెంజ్ ను స్వీకరించవచ్చు.

నగదు పురస్కారాల వివరాలు
ఈ ఛాలెంజ్ లో మొదటి స్థానం కైవసం చేసుకునే జట్టుకు లేదా వ్యక్తికి రూ. 50 లక్షల నగదు పురస్కారం అందజేస్తారు. పోటీలో రెండో స్థానంలో నిలిచే వ్యక్తికి రూ.20 లక్షలు అందజేస్తారు. అదే విధంగా దీన్ని డెవలెప్ చేయడంలో విజయం సాధించిన వారికి ఎమ్ఈఐటివైఈ ఇన్ క్యూబేటర్/ సీఓఈలో సభ్యులు అయ్యే అవకాశం కల్పిస్తారు. దీంతో ఆత్మ నిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాకు పోత్సాహం లభిస్తుంది. ఐసీటి గ్రాండ్ ఛాలెంజ్ కు సంబంధించిన అన్ని వివరాలను పొందడానికి మీరు https://jjm.gov.in/ వెబ్ సైట్ విజిట్ చేస్తే సరిపోతుంది.

ALSO READ| Credit Card Benefits: క్రెడిట్ కార్డు వల్ల లాభాలివే..

100 గ్రామాలతో ప్రారంభం
2024 వరకు ప్రతీ గ్రామానికి నల్లా నీటి కనెక్షన్  ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ కార్యక్రమాన్ని మానిటర్ చేయడం, క్వాలిటీని పరిరక్షించడం చాలా అవసరం. అందుకే ఆటోమెటిక్ గా నడించే విధానం లేదా సాంకేతికత కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వాటర్ సప్లై కు సంబంధించిన మొత్తం వ్యవస్థను డిజిటలైజ్ చేయడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. జలమే జీవనం అనే కార్యక్రమాన్ని ముందుగా 100గ్రామాలతో ప్రారంభించి తరువాత విస్తరించనున్నారు.

ALSO READ|  Aadhaar Lock & Unlock: మీ ఆధార్ దుర్వినియోగం అయిందా ? ఇలా లాక్ చేసి అన్ లాక్ చేయండి!

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News