IPL 2020: ఈ ఐపీఎల్ లో మనం మిస్సయ్యే టాప్ 5 విషయాలివే

క్రికెట్ ప్రేమికులను ఎప్పటి నుంచో ఊరిస్తోన్న అతిపెద్ద క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ఎట్టకేలకు ప్రారంభం అయింది.

  • Sep 19, 2020, 19:54 PM IST

క్రికెట్ ప్రేమికులను ఎప్పటి నుంచో ఊరిస్తోన్న అతిపెద్ద క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ఎట్టకేలకు ప్రారంభం అయింది. కరోనావైరస్ వల్ల విసుగెత్తని వారికి ఈ లీగ్ ఒక భారీ ఊరటను ఇవ్వనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈసారి జరుగుతున్న లీగ్ కు గత లీగ్ కు మధ్య చాలా తేడాలు ఉన్నాయి. మనం చాలా విషయాలు ఈ సారి మిస్ అవనున్నాం. అందులో ప్రధానంగా ఈ 5 విషయాలు మాత్రం తప్పకుండా మిస్ అవుతాం ఈ సారి.

1 /5

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ముందుగా గుర్తొచ్చేంది గ్రాండ్  ఓపెనింగ్ సెర్మనీ. కానీ ఈ సారి కోవిడ్-19 వల్ల దాన్ని మనం మిస్ అయ్యాం. 

2 /5

క్రికెట్ లో  చీర్ లీడర్స్ పరిచయం అయింది ఐపీఎల్ తో మాత్రమే. అలాంటి ఐపీఎల్ లో చీర్ లీడర్స్ ఈ సారికనిపించక పోవడం కాస్త ఫీల్ అయ్యే విషయమే. 

3 /5

ఐపీఎల్ అంటే ప్రేక్షకుల సందడి ఉంటుంది. స్టాండ్స్ లో ఉన్న  వేలాది మంది ప్రేక్షకుల సందడిని చూసి ఇంట్లో వీక్షించే లక్షలాది మంది ప్రేక్షకులకు జోష్ వచ్చేది. ఈ సారి అది కూడా మిస్సింగ్ లిస్ట్ లో చేరింది.

4 /5

ఫీల్డ్ కు బయట.. బౌండరీకి సమీపంలో, పెవిలియన్ లో ఇలా పలు చోట్ల క్రికెట్ సాంకేతిక టీమ్ ను చూడటం అనేది ఆటలో అలవాటుగా మారిపోయింది. కానీ ఈ సారి అలాంటి కొన్ని సీన్స్ కనిపించవు.

5 /5

మ్యాచుకు ముందు మ్యాచు తరువాత మీడియాతో టీమ్ కెప్టెన్లు చాట్ చేసేవాళ్లు. రిపోర్టర్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు. ఈ సారి అది మిస్ అవుతాం.