Vitamin D in Pregnant Lady: గర్భంతో ఉన్నప్పుడు విటమిన్ డి లోపం ఉంటే ఏమవుతుంది ?

Vitamin D in Pregnant Lady: విటమిన్ డి. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఈ విటమిన్ ప్రాముఖ్యత పెరిగింది. అయితే అంతకుముందే విటమిన్ డి ప్రాధాన్యత అనేది గర్భిణీలకు తెలుసు. విటమిన్ డి లోపంతో తలెత్తే సమస్యలేంటి, విటమిన్ డి ప్రయోజనాలేంటి, ఏ ఆహార పదార్ధాల్లో ఎక్కువగా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 26, 2022, 04:55 PM IST
Vitamin D in Pregnant Lady: గర్భంతో ఉన్నప్పుడు విటమిన్ డి లోపం ఉంటే ఏమవుతుంది ?

Vitamin D in Pregnant Lady: విటమిన్ డి. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఈ విటమిన్ ప్రాముఖ్యత పెరిగింది. అయితే అంతకుముందే విటమిన్ డి ప్రాధాన్యత అనేది గర్భిణీలకు తెలుసు. విటమిన్ డి లోపంతో తలెత్తే సమస్యలేంటి, విటమిన్ డి ప్రయోజనాలేంటి, ఏ ఆహార పదార్ధాల్లో ఎక్కువగా ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళకు న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ చాలా అవసరం. గర్భిణీ స్త్రీలకు, కడుపులో బిడ్డ ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యం. సాధారణంగా మనం విటమిన్ ఏ, సిలకు ఇచ్చే ప్రాధాన్యత విటమిన్ డికు ఇవ్వం. అయితే ఇతర విటమిన్లలానే విటమిన్ డి కూడా ప్రెగ్నెన్సీ సమయంలో అంతే ముఖ్యం. రక్తంలో ఫాస్పరస్, కాల్షియంలను సమతుల్యంగా ఉంచేది విటమిన్ డి మాత్రమే. కాల్షియంను సంగ్రహించేది కూడా విటమిన్ డినే. ఎముకలు, పళ్ల ఆరోగ్యాన్ని పట్టి ఉంచుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. గర్భిణీగా ఉన్నప్పుడు ఆరోగ్యంతో ఉండాలనుకుంటే విటమిన్ డిను నిర్లక్ష్యం చేయకూడదు. విటమిన్ డి అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో విటమిన్ డి లోపంతో తలెత్తే సమస్యలు, విటమిన్ డి ప్రయోజనాలు, ఏయే ఆహార పదార్ధాల్లో విటమిన్ డి ఎక్కువగా లభిస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. గర్భంతో ఉన్నప్పుడు విటమిన్ డి లోపం తలెత్తితే..సాధ్యమైనంత త్వరగా ఆ సమస్యను దూరం చేయాలి. లేకపోతే ఎముకల్లో నొప్పి లేదా ఎముకల బలహీనతకు దారీ తీస్తుంది. అటు కడుపులో బిడ్డ ఎముకల బలానికి కూడా విటమిన్ డి చాలా ముఖ్యం. బేబీ బరువుపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. గర్భిణీగా ఉండే మహిళకు రక్తపోటు అధికంగా ఉంటుంది. గర్భిణీగా ఉన్నప్పుడు ఎండకు దూరంగా ఉండటం, బయటకు వెళ్లకపోవడం, విటమిన్ డి ఉండే పదార్ధాలు తీసుకోకపోవడం, స్కిన్ పెగ్మెంటేషన్, ఎక్కువగా సన్‌స్క్రీన్ వాడటం వల్ల విటమిన్ డి లోపం తలెత్తవచ్చు.

ప్రెగ్నెన్సీలో విటమిన్ డి లోపంతో ఎదురయ్యే ముప్పు

ప్రెగ్నెన్సీలో విటమిన్ డి లోపం ఉంటే ప్రీ ఎక్లాంప్సియా, బ్యాక్టీరియల్ వెజినోసిస్, జెస్టేషనల్ డయాబెటిస్, గర్భస్రావం, ప్రీటెర్మ్ లేబర్, ఫీటస్ బలహీనంగా ఉండటం వంటివి ఎదురౌతాయి. విటమిన్ డి లోపముంటే..ప్రధానంగా ఎముకల్లో తీవ్రమైన నొప్పి, మజిల్ పెయిన్స్, క్రాంప్స్, అలసట, మూడ్ స్వింగ్స్, ఇరిటేషన్, నీరసం లక్షణాలు కన్పిస్తాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో విటమిన్ డి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఎముకలు, మజిల్స్, పళ్లను ఆరోగ్యవంతంగా శక్తివంతంగా చేస్తుంది. విటమిన్ డి కావల్సినంత ఉంటే డయాబెటిస్ సమస్య తలెత్తదు. ప్రీ ఎక్లాంప్సియా అంటే అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది. విటమిన్ డి సరిగ్గా ఉంటే కడుపులో బిడ్డ ఎదుగుదల కూడా బాగుంటుంది. ప్రీ మెచ్యూర్ బేబీ అవకాశాలు తగ్గిపోతాయి. అంతేకాదు విటమిన్ డి కావల్సిన పరిమాణంలో ఉంటే..సిజేరియన్ నివారించవచ్చు. ఇక విటమిన్ డి ప్రధానంగా ఉండేది ఎండలోనే. పాలు, ఛీజ్, ఫ్యాటీ ఫిష్, గుడ్లు, ఆరెంజ్ జ్యూస్, తృణధాన్యాల్లో కూడా విటమిన్ డి లభిస్తుంది. 

Also read: Turmeric Remedies: పసుపుతో ఇలా చేస్తే మీ సమస్యలన్నీ తొలగి.. డబ్బు కొరత తీరుతుంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News