Turmeric Remedies: పసుపుతో ఇలా చేస్తే మీ సమస్యలన్నీ తొలగి.. డబ్బు కొరత తీరుతుంది..

Turmeric Remedies in Astrology : జ్యోతిష శాస్త్రంలో కొన్ని సమస్యలకు పసుపుతో కూడిన రెమెడీస్ ఉన్నాయి. వాటిని పాటిస్తే సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2022, 04:02 PM IST
  • జ్యోతిష శాస్త్రంలో పసుపుతో అద్భుతమైన రెమెడీస్
  • డబ్బు కొరతకు, వైవాహిక జీవితంలో సంతోషానికి
  • ఇతరత్రా సమస్యలు తొలగిపోవడానికి రెమెడీస్
Turmeric Remedies: పసుపుతో ఇలా చేస్తే మీ సమస్యలన్నీ తొలగి.. డబ్బు కొరత తీరుతుంది..

Turmeric Remedies in Astrology : ఆయుర్వేదంలోనే కాదు జ్యోతిషశాస్త్రంలోనూ పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంది. పసుపు బృహస్పతికి సంబంధించినది. పూజా క్రతువుల్లో పసుపు తప్పనిసరి. పసుపు లేకుండా విష్ణువును పూజించడం అసంపూర్ణమని నమ్ముతారు. విష్ణుమూర్తి-లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజలో పసుపును ఉపయోగిస్తారు. పసుపుతో కొన్ని పద్దతులు పాటించడం వల్ల మీ సమస్యలన్నీ తొలగి.. మీరు చేసే పనిలో విజయం లభిస్తుంది.

విజయానికి మార్గం :

మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లినప్పుడు, వినాయకుడికి పసుపు ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే, మీ నుదుటికి పసుపు తిలకం రాయండి. ఇలా చేయడం వల్ల మీ పనిలో విజయం లభిస్తుంది. ఏదైనా పవిత్రమైన లేదా ముఖ్యమైన పనిని గురువారం చేపట్టడం ఉత్తమం

డబ్బు కొరత తీరుతుంది :

చేతిలోకి పసుపుని తీసుకుని విష్ణు సహస్రాబ్ది (విష్ణువు) పఠించండి. పూర్తి భక్తితో ఈ పారాయణం చేస్తే.. మీకు విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. డబ్బు కొరత తీరుతుంది.

ఆటంకాలను తొలగించడానికి :

మీరు చేసే పనిలో ఆటంకాలు తొలగిపోవాలంటే.. బ్రాహ్మణుడికి పసుపు, గొర్రె పిల్లను దానం చేయండి. అలాగే, అరటి మొక్క వేరుపై పసుపు వేయండి. ఇది అన్ని అడ్డంకులను తొలగిస్తుంది.

డబ్బు పొందే మార్గం :

ఒక ఎర్రటి వస్త్రంలో 5 పసుపు ముద్దలు వేసి డబ్బు ఉంచిన చోట పెట్టండి. లక్ష్మీ దేవిని ప్రార్థించండి. ఇలా ప్రతీ శుక్రవారం చేయడం వల్ల మీకు లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది.

వైవాహిక జీవితంలో సంతోషానికి :

పసుపు కలిపిన నీటితో స్నానం చేయండి. తద్వారా మీ దాంపత్య జీవితంలో ప్రేమ వెల్లివిరుస్తుంది. 
 

Also Read: Russia Ukraine War: రష్యా యుద్ధ తంత్రం.. మోదీ సాయం కోరిన ఉక్రెయిన్.. జోక్యం చేసుకుంటారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News