America Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలుగు వ్యక్తులు దుర్మరణం

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలుగు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మినీ వ్యాన్‌.. ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతిచెందిన వారు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించగా.. వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2022, 04:18 PM IST
America Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలుగు వ్యక్తులు దుర్మరణం

Telugu people Died in US Road Accident: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలుగు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మినీ వ్యాన్‌.. ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. మృతిచెందిన వారు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించగా.. వారికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మసాచుసెట్స్‌లోని షెఫ్‌ఫీల్డ్‌లో ఉదయం 5.30 గంటల సమయంలో మినీ వ్యాన్‌.. ట్రక్కు ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో మినీ వ్యాన్‌లో మొత్తం ఏడుగురు ఉండగా.. ట్రక్కులో డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. రెండు వాహనాల డ్రైవర్లు ప్రాణాలతో బయటపడగా.. నలుగురు మృతిచెందారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాద ఘటనపై అక్కడి అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

నెల క్రితం అమెరికాలోని టాక్సాస్‌లోని వాలర్ కౌంటీ వద్ద రోడ్డు ప్రమాదంలో తానా బోర్డు సభ్యుడు డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య వాణి శ్రీ, ఇద్దరు కుమార్తెలు  మృత్యువాత పడిన విషయం తెలిసిందే. శ్రీనివాస్‌ భార్య తమ కుమార్తెలను కాలేజీ నుంచి తీసుకువస్తుండగా.. వీరి కారును ఓ వ్యాన్‌ ఢీకొట్టింది. ఘటన స్థలంలోనే ఇద్దరు మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో నలుగురు తెలుగు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది.

Also Read: Bigg Boss Geetu : అందుకే గీతూకి గెలిచే అర్హత లేదనేది.. బిగ్ బాస్ హిస్టరీలోనే వరెస్ట్ కంటెస్టెంట్‌? 

Also Read:England vs Ireland: టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం.. ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News