Bigg Boss Geetu : అందుకే గీతూకి గెలిచే అర్హత లేదనేది.. బిగ్ బాస్ హిస్టరీలోనే వరెస్ట్ కంటెస్టెంట్‌?

Galata Geetu As Sanchalak బిగ్ బాస్ ఆట ఆడేందుకు తెలివి ఉంటే బాగానే ఉంటుంది. కానీ అతి తెలివి ఉంటేనే పరిస్థితులు తేడా కొడుతుంటాయి. తనకు తాను మేధావి అనుకుంటూ భ్రమలో ఉండే గీతూకి ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 26, 2022, 04:02 PM IST
  • బిగ్ బాస్ చేపల చెరువు టాస్క్
  • సంచాలక్‌గా చాన్స్ ఇచ్చిన బిగ్ బాస్
  • ఎప్పటిలానే అతి చేసిన గలాట గీతూ
Bigg Boss Geetu : అందుకే గీతూకి గెలిచే అర్హత లేదనేది.. బిగ్ బాస్ హిస్టరీలోనే వరెస్ట్ కంటెస్టెంట్‌?

Galata Geetu As Sanchalak : బిగ్ బాస్ ఇంట్లో గలాట గీతూని చూడాలంటేనే చిరాగ్గా ఉంటుంది. మొదటి వారంలోనే ఇంటి నుంచి బయటకు వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ నామినేషన్లో లేకపోవడంతో బతికిపోయింది. ఆమె మాట్లాడుతూ ఉంటే భరించలేకపోతోన్నాం, మ్యూట్ చేయాల్సి వస్తుందంటూ దారుణమైన ట్రోలింగ్ నడిచింది. అయితే ఉన్న కంటెస్టెంట్లలో కాస్తో కూస్తో ఆటను కొత్తగా ఆడేందుకు గీతూ ప్రయత్నిస్తుంటుంది. ఆట ఆడేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ ఆ ఆటను మాత్రం ఆడదు. ఇంత వరకు ఆమె గెలిచిన దాఖలాలు లేవు.

ఏమైనా అంటే తానే ఆటలు ఆడతాను.. తానే గొప్ప ప్లేయర్‌ని అనే భ్రమలో గీతూ ఉంటుంది. తన ఆట ఇంకా మొత్తం చూడలేదని, చూపిస్తానంటూ తెగ ఆత్రం అవుతుంటుంది. ఈమె మాటలు కోటలు దాటుతాయి. కానీ చేతలు మాత్రం గడప కూడా దాటవు. చెప్పేదానికి చేసే దానికి అస్సలు సంబంధం ఉండదు. గీతూ తానేం చేసినా రైట్ అని వాదిస్తుంటుంది. ఆమె ఎవరి మధ్యలోకి దూరైనా మాట్లాడుతుంది. కానీ ఈమె మ్యాటర్లో మాత్రం ఎవ్వరూ దూరకూడదన్నట్టుగా చేస్తుంది.

ఆమె రూల్స్ చెబుతుంది. కానీ రూల్స్ పాటించదు. బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ కూడా పాటించదు. తనకు నచ్చినట్టుగా, పిచ్చి పిచ్చిగా ఆడేస్తుంటుంది. తాను గెలవాలని ఎప్పుడు కూడా ఆడదు. పక్క వాళ్లని ఎలా తొక్కేయాలి.. ఎవరిని ఎలా రెచ్చగొట్టాలి, వీక్ పాయింట్ల మీద ఎలా కొట్టాలనే కుళ్లు కుతంత్రాలతోనే ఆలోచిస్తుంటుంది. కానీ ఎప్పుడు కూడా నేరుగా ఆట ఆడలేదు. చేపల చెరువు టాస్కులోనూ అంతే. రేవంత్,మెరినా, కీర్తిలను రెచ్చగొడదామని చూసింది. పక్క వారిదాంట్లోంచి లాగేసుకుందామని చూసింది. చివరకు తక్కువ చేపలు పట్టుకోవడం ఆట నుంచి తప్పుకుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News