APPLE: 4 వేల 5 వందల చైనీస్ గేమ్స్ ను తొలగించిన యాపిల్ సంస్థ

చైనా దేశపు యాప్ లే కాదు మొబైల్ గేమ్స్ కూడా ఇకపై యాప్ స్టోర్ లో కన్పించవు. డిజిటల్ స్ట్రైక్స్ తో బారతదేశం  చైనా దేశపు యాప్ లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.  ఇప్పుడు ప్రఖ్యాత మొబైౌల్ బ్రాండ్ యాపిల్  సంస్థ  చైనీస్ యాప్ స్టోర్ నుంచి భారీగా మొబైల్ గేమ్స్ ను తొలగించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 వేల 5 వందల మొబైల్ గేమ్స్ ను చైనీస్ యాప్ స్టోర్ నుంచి తొలగించడంతో చైనా కంపెనీలు ఆందోళనలో పడ్డాయి. రానున్న కాలంలో వీటిని రెన్యువల్ చేసుకుంటేనే గానీ తిరిగి అప్ లోడ్ కావు.

Last Updated : Jul 5, 2020, 08:09 PM IST
APPLE: 4 వేల 5 వందల చైనీస్ గేమ్స్ ను  తొలగించిన యాపిల్ సంస్థ

చైనా దేశపు యాప్ లే కాదు మొబైల్ గేమ్స్ కూడా ఇకపై చైనీస్ యాప్ స్టోర్ లో కన్పించవు. డిజిటల్ స్ట్రైక్స్ తో బారతదేశం చైనా దేశపు యాప్ లపై నిషేధం విధించింది. ఇప్పుడు ప్రఖ్యాత మొబైౌల్ బ్రాండ్ యాపిల్ చైనీస్ యాప్ స్టోర్ నుంచి భారీగా మొబైల్ గేమ్స్ ను తొలగించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 వేల 5 వందల మొబైల్ గేమ్స్ ను చైనీస్ యాప్ స్టోర్ నుంచి తొలగించడంతో చైనా కంపెనీలు ఆందోళనలో పడ్డాయి. రానున్న కాలంలోవీటిని తిరిగి రెన్యువల్ చేసుకుంటేనా గానీ తిరిగి అప్ లోడ్ కావు. 

భారత చైనా సరిహద్దు వివాదం నేపధ్యంలో చైనాకు చెందిన 59 యాప్ లను ఇండియా నిషేధించింది. ముఖ్యంగా కోట్లాది సంఖ్యలో యూజర్స్ ఉన్న టిక్ టాక్ ను నిషేధించడం చైనాకు భారీ షాక్ గా చెప్పుకోవచ్చు. భారతదేశం తీసుకున్న ఈ చర్యను అమెరికా వంటి దేశాలు సమర్దించాయి కూడా. దీంతో చైనా కంపెనీలకు ఆర్ధికంగా చాలా నష్టం చేకూరింది. ఈ నష్టం నుంచి తేరుకోకముందే ప్రముఖ మొబైల్ దిగ్గజమైన యాపిల్ సంస్థ ...చైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు తీసుకున్న నిర్ణయంతో ఆ దేశ కంపెనీలకు షాక్ తగిలింది. చైనీస్ యాప్ స్టోర్ నుంచి ఏకంగా 4 వేల 5 వందల మొబైల్ గేమ్స్ ను యాపిల్ సంస్థ ఒక్కసారిగా తొలగించింది. దీంతో చైనా కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చట్టపరంగా ఎలాంటి అనుమతి లేకుండానే కొన్ని కంపెనీలు తమ గేమ్స్ ను యాప్ లలో ఉంచుతున్నాయనేది యాపిల్ సంస్థ చెబుతోంది. యాపిల్ చైనాతో ఆ దేశానికున్న వాణిజ్య పరమైన ఒప్పందాలు, లైసెన్స్ వ్యవహారాలకు సంబంధించిన నిబంధనల్లో చేపట్టిన మార్పుల కారణంగా తామీ ఈ గేమ్స్ ను తొలగించినట్టు యాపిల్ ప్రకటించింది. లైసెన్స్ నిబంధనలకు గడువు జూన్ 30తో పూర్తయినందున ఈ చర్యలు తీసుకున్నామని యాపిల్ సంస్థ స్పష్టం చేసింది. Also read: Moj app: TikTok కి ప్రత్యామ్నాయంగా మరో యాప్ లాంచ్ చేసిన ShareChat

లైసెన్స్ నిబంధనల్ని తిరిగి రెన్యువల్ చేసుకున్న తరువాత మళ్లీ ఈ మొబైల్ గేమ్స్ ను అప్ లోడ్ చేసుకోవచ్చు. అయితే మొన్న చైనా యాప్ ల నిషేధం, ఇప్పుడు  చైనీస్ యాప్ స్టోర్ నుంచి గేమ్స్ తొలగింపుతో చైనా కంపెనీలకు ఎదురవుతున్న నష్టం విలువ 60-70 వేల కోట్ల వరకూ ఉంటుందని తెలుస్తోంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News