Thief Hang Viral Video: ట్రైన్‌లో చోరీకి ప్రయత్నం.. దొంగకు భలేగా బుద్ధి చెప్పిన ప్రయాణికుడు! 15 కిలోమీటర్ల పాటు

Viral Video, Thief Dangling On Moving Train For 15 KM in Bihar.  రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు చుక్కలు చూపించే దొంగకు.. రివర్స్‌లో ప్రయాణికుడే దొంగకు చుక్కలు చూపించాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Sep 16, 2022, 09:51 AM IST
  • ట్రైన్‌లో చోరీకి ప్రయత్నం
  • దొంగకు భలేగా బుద్ధి చెప్పిన ప్రయాణికుడు
  • 15 కిలోమీటర్ల పాటు
Thief Hang Viral Video: ట్రైన్‌లో చోరీకి ప్రయత్నం.. దొంగకు భలేగా బుద్ధి చెప్పిన ప్రయాణికుడు! 15 కిలోమీటర్ల పాటు

Viral Video, Thief Dangling On Moving Train For 15 KM in Bihar: బస్ స్టాప్, రైల్వే స్టేషన్ లాంటి రద్దీ ప్రదేశాల్లో దొంగలు ఎక్కువగా చోరీలు చేస్తుంటారు. ముఖ్యంగా ఎప్పుడూ జనాలతో కిటకిటలాడే రైల్వే స్టేషన్‌లో ఎక్కువగా చోరీలు జరుగుతుంటాయి. ప్రయాణికుడు కొంచెం ఏమరపాటుగా ఉన్నా.. మూల్యం చెల్లించుకోక తప్పదు. రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు చుక్కలు చూపించే దొంగకు.. రివర్స్‌లో ప్రయాణికుడే దొంగకు చుక్కలు చూపించాడు. కిటికీలోంచి సెల్‌ఫోన్‌ను చోరీ చేసేందుకు యత్నించిన దొంగ చేయి పట్టుకుని.. రైలు బయట గాల్లో వేలాడుతూ కొన్ని కిలోమీటర్లు ప్రయాణించేలా చేశాడు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. 

బుధవారం (సెప్టెంబర్ 14) ఓ ట్రైన్ బెగుసరాయ్ నుంచి ఖగారియాకు వెళుతోంది. ట్రైన్ సాహెబ్‌పూర్ కమాల్ స్టేషన్‌లో ఆగినప్పుడు.. ఓ దొంగ కన్ను కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికుడి సెల్‌ఫోన్‌పై పడింది. ట్రైన్ నెమ్మదిగా కదులుతున్న సమయంలో ఆ దొంగ కిటికీలోంచి మొబైల్ ఫోన్ దొంగిలించడానికి ప్రయతించాడు. అప్రమత్తంగా ఉన్న ప్రయాణికుడు కిటికీ లోపలికి వచ్చిన దొంగ చేయిని గట్టిగా పట్టుకున్నాడు. అదే సమయంలో ట్రైన్ వేగం పెరిగింది. దాంతో తన చేయిని వదిలేయాలంటూ ప్రయాణికుడిని ఆ దొంగ వేడుకున్నాడు. ఈలోగా ట్రైన్ ప్లాట్‌ఫాం దాటింది.

ట్రైన్ ప్లాట్‌ఫాం దాటడంతో దొంగ బయటే వేలాడాడు. రక్షించండి అంటూ గట్టిగా కేకలు వేశాడు. ఇక పట్టు కోసం దొంగ మరో చేయిని లోపలికి చాచాడు. ట్రైన్ లోపలున్న వారు అతని రెండు చేతులనూ పట్టుకుని కిందపడకుండా చూశారు. 15 కిలోమీటర్ల పాటు ఆ దొంగ కదులుతున్న ట్రైన్ బయట గాల్లోనే వేలాడాడు. ట్రైయిన్ ఖగారియా స్టేషన్ రాగానే ప్రయాణికులు అతడి చేతులు వదిలేశారు. వెంటనే అతడు కిందపడిపోయి నొప్పితో విలవిలాడాడు. ఆపై దొంగను ఖగారియా రైల్వే పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. దొంగను పంకజ్ కుమార్‌గా గుర్తించారు. 

ప్రస్తుతం దొంగ రైలుకు వేలాడడంకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. అయితే ఈ వీడియోపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. దొంగకు మంచి గుణపాఠం చెప్పారని కొందరు ట్వీట్స్ చేస్తుంటే.. కిటికీకి వేలాడదీయడం చాలా దారుణం అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ప్రాణం పొతే ఎవరిది బాధ్యత అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: IND vs AUS: భారత్‌ vs ఆస్ట్రేలియా పూర్తి షెడ్యూల్‌ ఇదే.. హైదరాబాద్‌లో మూడో టీ20!

Also Read: CUET UG 2022 Results: సీయూఈటీ-యూజీ ఫలితాలు విడుదల.. తొలిసారి 99 యూనివర్సిటీల్లో ప్రవేశాలు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News