IND vs AUS 2022 T20 Series Schedule: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. ఇరు జట్లు మూడు మ్యాచ్‌ల పొట్టి సిరీస్ ఆడనున్నాయి. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా టీమ్ గురువారం భారత్‌కు చేరుకుంది. సెప్టెంబరు 20న అయి సిరీస్ ఆరంభం కానుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్ జరుగుతుండడంతో భారత్, ఆస్ట్రేలియా జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. మూడు మ్యాచులు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
టీ20 సిరీస్ కోసం భారత్ పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా లాంటి కీలక ప్లేయర్స్ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల జట్టుకు దూరమయిన బుమ్రా ఎలా రాణిస్తాడన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు ఆసీస్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఈ సిరీస్ ఆడడం లేదు. మిచెల్ మార్ష్, మార్కస్ స్టొయినిస్, మిచెల్ స్టార్క్ గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యారు.
టీ20 సిరీస్ సెప్టెంబరు 20న మొదలై 25న ముగుస్తుంది. సెప్టెంబరు 20న మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో మొదటి టీ20 జరగనుంది. 23న నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రెండో మ్యాచ్.. 25న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మూడో మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌లో చాలా రోజుల తర్వాత మ్యాచ్ జరుగుతుండడంతో ఫాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. మూడు మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఆరంభం అవుతాయి. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ+హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ ప్రసారం అవుతుంది.
జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్యా, ఆర్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అష్టన్ అగర్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎలిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, కేన్ రిచర్డ్‌సన్, డేనియల్ సామ్స్, ఆడం జంపా.
Also Read: CUET UG 2022 Results: సీయూఈటీ-యూజీ ఫలితాలు విడుదల.. తొలిసారి 99 యూనివర్సిటీల్లో ప్రవేశాలు!
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. వరుసగా మూడోరోజు తగ్గిన పసిడి ధర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook