Stunning Flying Catch: ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన దక్షిణాఫ్రికా ప్లేయర్.. అవాక్కయిన హనుమ విహారి (వీడియో)!!

రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ప్లేయర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ పట్టిన అద్భుత క్యాచ్‌కు తెలుగు క్రికెటర్ హనుమ విహారి బలయ్యాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 4, 2022, 01:36 PM IST
  • ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన దక్షిణాఫ్రికా ప్లేయర్
  • అవాక్కయిన హనుమ విహారి
  • దక్షిణాఫ్రికా ఫీల్డర్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌
Stunning Flying Catch: ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన దక్షిణాఫ్రికా ప్లేయర్.. అవాక్కయిన హనుమ విహారి (వీడియో)!!

Rassie Van Der Dussen takes One Handed Catch to Dismiss Hanuma Vihari in IND vs SA 2nd Test: తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్టు తొలి రోజు తడబడింది. మిడిల్‌ ఆర్డర్‌ పేలవ ప్రదర్శన కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది.

కెప్టెన్ లోకేష్ రాహుల్‌ (50; 133 బంతుల్లో 9×4), వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ (46; 50 బంతుల్లో 6×4) రాణించడంతో 200 పరుగులు చేయగలిగింది. టెస్ట్ స్పెసలిస్ట్ బ్యాటర్లు చేటేశ్వర్ పుజారా (Pujara), అజింక్య రహానే (Rahane) మళ్లీ విఫలమయ్యారు. వీరితో పాటు రాకరాక అవకాశం దక్కించుకున్న తెలుగు క్రికెటర్ హనుమ విహారి (Hanuma Vihari) కూడా 20 పరుగులకే ఔట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా ప్లేయర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (Rassie van der Dussen) పట్టిన అద్భుత క్యాచ్‌కు విహారి బలయ్యాడు. 

తొలిరోజు లంచ్‌కు ముందు టీమిండియా స్టార్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ (26)ను దక్షిణాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్ ఔట్ చేశాడు. ఆపై డువాన్ ఆలివర్ వరుస బంతుల్లో చెతేశ్వర్ పుజారా (3), అజింక్య రహానే (0)లను అవుట్ చేశాడు. ఈ సమయంలో కెప్టెన్ కెఎల్ రాహుల్ (KL Rahul) మరియు హనుమ విహారి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.

ఇద్దరు కలిసి 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం కాగిసో రబాడ (Kagiso Rabada) ఓ అద్భుత బంతితో విహారిని అవుట్ చేశాడు. 39వ ఓవర్ నాలుగో బంతిని రబాడ షార్ట్ పిచ్ రూపంలో సాధించగా.. డిఫెండ్ చేయడానికి విహారి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ లోపలి అంచుకు తగిలి షార్ట్ లెగ్ దిశగా వెళ్లింది. 

Also Read: Crime News: పెద్దల్ని ఒప్పించలేక.. ఒకరికి దూరంగా మరొకరు ఉండలేక.. చావుతో ఒకటైన ప్రేమజంట!!

షార్ట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రాస్సీ వాన్ డెర్ డస్సెన్.. ఎడమవైపు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ (Rassie van der Dussen Catch) అందుకున్నాడు. ఇంకేముంది దాదాపు ఏడాది తర్వాత తొలి టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న హనుమ విహారి నిరాశగా పెవిలియన్ చేరాడు. కాగిసో రబాడ, డస్సెన్ సంబరాలు చేసుకున్నారు. డస్సెన్ పట్టిన క్యాచ్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

డస్సెన్ పట్టిన అద్భుత క్యాచ్‌ను క్రికెట్ దక్షిణాఫ్రికా తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. వీడియో చూసిన ఫాన్స్ తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. 'స్టన్నింగ్ క్యాచ్' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'డస్సెన్.. సూపర్ క్యాచ్' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. డస్సెన్ పట్టిన క్యాచ్ ఇప్పటికే 'క్యాచ్ ఆఫ్ ది ఇయర్' లిస్టులో చేరిపోయింది. 

Also Read: Virat Kohli ODI Series: టీమిండియాకు భారీ షాక్‌.. వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం! కారణం ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News