Shane Watson retires: రిటైర్మెంట్ ప్రకటించిన షేన్ వాట్సన్

Shane Watson retirement news: షేన్ వాట్సన్ విషయంలో ఊహించిందే జరిగింది. అవును ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. నాలుగేళ్ల క్రితమే ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన వాట్సన్.. తాజాగా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్స్‌కి గుడ్ బై ( Shane Watson retired ) చెబుతున్నట్టు ప్రకటించాడు. 

Last Updated : Nov 3, 2020, 07:24 PM IST
Shane Watson retires: రిటైర్మెంట్ ప్రకటించిన షేన్ వాట్సన్

Shane Watson retirement news: షేన్ వాట్సన్ విషయంలో ఊహించిందే జరిగింది. అవును ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. నాలుగేళ్ల క్రితమే ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన వాట్సన్.. తాజాగా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్స్‌కి గుడ్ బై ( Shane Watson retired ) చెబుతున్నట్టు ప్రకటించాడు. ఐపిఎల్ 2020లో భాగంగా అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ( CSK vs KXIP match ) మధ్య జరిగిన మ్యాచ్ వాట్సన్ కెరీర్‌లో చివరి ఆట అయ్యింది. IPL 2020 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించినప్పటికీ .. టోర్నమెంట్‌లో పంజాబ్‌తో ఆడిన చివరి ఆటలో మాత్రం విజయం సాధించింది. Also read : Kapil Dev about Dhoni: ధోనీ ఆటపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

Shane Watson about his retirement: వీడ్కోలు గురించి షేన్ వాట్సన్...
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లోనే వాట్సన్ తన రిటైర్మెంట్ విషయాన్ని తోటి ఆటగాళ్లతో పంచుకుని భావోద్వేగానికి గురైనట్టు తెలిసింది. చెన్నై సూపర్ కింగ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన విషయాన్ని ఆ జట్టు మేనేజ్‌మెంట్ సైతం ధృవీకరించినట్టు వార్తలొచ్చాయి. అలా షేన్ వాట్సన్ తన వీడ్కోలుపై బయటి ప్రపంచానికి చెప్పడానికంటే ముందుగానే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

తన రిటైర్మెంట్‌పై మీడియాలో వస్తున్న కథనాలపై షేన్ వాట్సన్ స్పందిస్తూ తన యూట్యూబ్ ఛానెల్ T20 Stars ద్వారా అసలు విషయాన్ని చెప్పేశాడు. ఐపిఎల్‌తో తన అనుబంధాన్ని ఓ అదృష్టంగా అభివర్ణించిన వాట్సన్.. తనను ఆదరించినందుకు ప్రతీ ఒక్కరికి, తన విజయానికి బాటలు వేసిన తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపాడు. Also read : RCB vs DC match: రహానె, ధావన్ అర్థ శతకాలతో ప్లే ఆఫ్స్‌కి చేరిన ఢిల్లీ

 

Shane Watson IPL journey | ఐపిఎల్‌లో షేన్ వాట్సన్ ప్రస్థానం:
2008లో రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals ) జట్టుతో ఐపిఎల్ ప్రస్థానం ఆరంభించిన షేన్ వాట్సన్ ఆ జట్టు తరపునే 2015 వరకు ఆడాడు. అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) ఫ్రాంఛైజీ అతడిని కొనుగోలు చేసింది. 2017 వరకు బెంగళూరు జట్టు తరుపున ఐపిఎల్ ఆడిన షేన్ వాట్సన్.. 2018 నుంచి గత మూడేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) జట్టు కోసం ఆడుతున్నాడు. తాను ఏ జట్టులో ఉన్నా.. తన ప్రత్యేకతను చాటుకున్న క్రికెటర్‌గా షేన్ వాట్సన్‌కి మంచి గుర్తింపు ఉంది. Also read : 
Shane Watson retirement: క్రికెట్‌కు షేన్ వాట్సన్ గుడ్ బై ?

CSK farewell to Shane Watson : ఘనంగా వీడ్కోలు పలికిన చెన్నై సూపర్ కింగ్స్..
చెన్నై సూపర్ కింగ్స్ విజయాలలో కీలక పాత్ర పోషించిన స్టార్ ప్లేయర్ షేన్ వాట్సన్ కి ఆ జట్టు యాజమాన్యం ఘనంగా వీడ్కోలు పలికింది. వాట్సన్ పేరుని 'వాట్ ఏ సన్' గా రాస్తూ చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్‌లో ఓ పోస్ట్ అప్‌లోడ్ చేసింది. ''నీ సహాయం అవసరమైన ప్రతీసారి జట్టు కోసం నిలిచినందుకు కృతజ్ఞతలు'' అంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఆ ట్వీట్‌లో పేర్కొంది. 

 

Also read : Reasons behind CSK defeat: చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి కారణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News