Kapil Dev about Dhoni: ధోనీ ఆటపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

ఐపిఎల్ 2020లో మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) కెప్టేన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలిసారిగా ప్లే ఆఫ్స్‌లోకి ( Playoffs ) వెళ్లకుండానే నిష్క్రమించింది. మూడుసార్లు ఐపిఎల్ టైటిల్ గెల్చుకున్న చెన్నై జట్టు ( CSK ) ఈసారి ఘోర పరాజయాలు చవిచూసింది. ముఖ్యంగా ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన మహేంద్ర సింగ్ కేవలం 200 పరుగులు మాత్రమే చేయడం అతడి ఫిట్‌నెస్‌పై అనుమానాలకు తావిచ్చింది.

Last Updated : Nov 3, 2020, 02:21 AM IST
Kapil Dev about Dhoni: ధోనీ ఆటపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

ఐపిఎల్ 2020లో మహేంద్ర సింగ్ ధోనీ ( MS Dhoni ) కెప్టేన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలిసారిగా ప్లే ఆఫ్స్‌లోకి ( Playoffs ) వెళ్లకుండానే నిష్క్రమించింది. మూడుసార్లు ఐపిఎల్ టైటిల్ గెల్చుకున్న చెన్నై జట్టు ( Chennai Super Kings ) ఈసారి ఘోర పరాజయాలు చవిచూసింది. ముఖ్యంగా ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన మహేంద్ర సింగ్ కేవలం 200 పరుగులు మాత్రమే చేయడం అతడి ఫిట్‌నెస్‌పై అనుమానాలకు తావిచ్చింది. ఇలా ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండానే 116 పూర్ స్ట్రైక్ రేట్‌తో ఐపిఎల్ పోరు ముగించడం మహీ కెరీర్‌లో ఇదే తొలిసారి. దీంతో వచ్చే ఏడాది అసలు మహీ ఐపిఎల్‌లో కొనసాగుతాడా లేక దీనికి కూడా గుడ్ బై చెబుతాడా అనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒకవేళ వచ్చే ఏడాది ఐపిఎల్‌లో మహీ కొనసాగినా.. చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉంటాడో లేదో అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. Also read : RCB vs DC match: రహానె, ధావన్ అర్థ శతకాలతో ప్లే ఆఫ్స్‌కి చేరిన ఢిల్లీ

తనపై వచ్చిన ఆ విమర్శలన్నింటికి చెక్ పెడుతూ IPL 2020 పోరాటం చివర్లో మూడు మ్యాచ్‌లు గెలిచిన ధోనీ.. '' వచ్చే ఏడాది కూడా తాను చెన్నై సూపర్ కింగ్స్ తరపునే బరిలోకి దిగుతాను'' అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో మ్యాచ్‌కి ముందు టాస్ వేసే సందర్భంగా కామెంటేటర్ డేని మారిసన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ధోనీ ఈ వ్యాఖ్యలు చేశాడు.  

ఐతే ఐపిఎల్‌లో కొనసాగుతాను అని ధోనీ చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్  ( Kapil Dev about MS Dhoni IPL career ) స్పందిస్తూ.. ఏడాది మొత్తం ఏ మ్యాచ్ ఆడకుండా నేరుగా ఐపిఎల్‌లో మాత్రమే ఆడుతా అని ధోనీ నిర్ణయించుకుంటే.. ఐపిఎల్‌లో పర్‌ఫామ్ చేయడం అతడికి కచ్చితంగా అసాధ్యమే అవుతుందని అభిప్రాయపడ్డాడు. ''అందుకు ఉదాహరణగా ఈ ఏడాది ఐపిఎల్‌లో ఏం జరిగిందో మనం అంతా చూశాం'' అంటూ ధోనీ పర్‌ఫార్మెన్స్‌పై, అతడి ఫిట్‌నెస్‌పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. Also read : Shane Watson retirement: క్రికెట్‌కు షేన్ వాట్సన్ గుడ్ బై ?

ఐపిఎల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాలని భావిస్తే అది కష్టమేనని నిక్కచ్చిగా చెప్పిన కపిల్ దేవ్... ధోనీ వయస్సుపైనా ఓ కామెంట్ చేశాడు. వయస్సు గురించి ప్రస్తావించకూడదంటూనే.. ఈ వయస్సులో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ట్యూన్ కాగలరని.. లేదంటే ఆట ఆడటం కష్టమేనని కపిల్ దేవ్ స్పష్టంచేశాడు. ధోనీ మళ్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడితేనే ఐపిఎల్‌లో అతడి పర్‌ఫార్మెన్స్ మెరుగుపడుతుందని కపిల్ సూచించాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News