Reasons behind CSK defeat: చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి కారణాలు

యుఏఇలో ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్లే ఆఫ్స్ ( IPL 2020 playoffs ) రేస్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఐపిఎల్ 2020లో చివరి లీగ్ మ్యాచ్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ( Kings XI Punjab ) 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Last Updated : Nov 2, 2020, 08:45 PM IST
Reasons behind CSK defeat: చెన్నై సూపర్ కింగ్స్ ఓటమికి కారణాలు

యుఏఇలో ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ప్లే ఆఫ్స్ ( IPL 2020 playoffs ) రేస్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఐపిఎల్ 2020లో చివరి లీగ్ మ్యాచ్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ( Kings XI Punjab ) 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ( Stephen Fleming ) మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో తమ జట్టు అనేక సవాళ్లు ఎదుర్కొందని చెప్పుకొచ్చాడు. తొలుత మొదటి మ్యాచ్‌లో బాగానే ఆడామని చెప్పిన ఫ్లెమింగ్.. ఆ ఆటను చివరి వరకు కొనసాగించలేకపోయామని అభిప్రాయపడ్డాడు. జట్టులో అనేక లోపాలున్నాయని గుర్తించామని.. వచ్చే ఏడాది ఐపిఎల్ నాటికి ఆ లోపాలను సవరిస్తామని ఫ్లెమింగ్ తెలిపాడు. జట్టు నుంచి సురేష్ రైనా నిష్క్రమణను ( Suresh Raina's exit ) ఉద్దేశించే స్టీఫెన్ ఫ్లెమింగ్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Also read : KKR vs RR Match Highlights: ఐపీఎల్ 2020 నుంచి నిష్క్రమించడంపై స్టీవ్ స్మిత్ ఏమన్నాడంటే..

చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపై ( CSK exit from IPL 2020 ) అసంతృప్తి ఉన్నప్పటికీ.. ధోనీ, ఫ్లెమింగ్ పట్ల ఆ జట్టు యజమాని శ్రీనివాసన్‌కి ( CSK owner Srinivasan ) వారిపై కోపం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2008 నుంచి ధోనీ ఆ జట్టుతోనే జత కడుతున్నాడు. ధోనీపై శ్రీనివాసన్‌కి ఎంతో నమ్మకం. అందుకే ఈసారి ఓటమిని అర్థం చేసుకోగలడని, వచ్చే ఏడాది కూడా జట్టు ఎంపికతో పాటు జట్టును బ్యాలెన్స్ చేసే విషయంలో ధోనీ, ఫ్లెమింగ్‌లకు శ్రీనివాసన్ నుంచి పూర్తి స్వేచ్ఛ ఉంటుందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు. Also read : Rajasthan Royals: ఐపిఎల్‌ 2020 నుంచి రాజస్థాన్ రాయల్స్ ఔట్

IPL 2020 టోర్నమెంట్‌లో కొనసాగడం లేదని తెలిశాకా కూడా తమ జట్టు 3 మ్యాచ్‌లు గెలవడాన్ని ప్రస్తావిస్తూ జట్టులోని సామర్థ్యాన్ని ఫ్లెమింగ్ సమర్థించాడు. ఒత్తిడి లేనప్పుడే అసలైన ఆటను ఆడగలరని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డాడు. Also read : IPL 2020: చెన్నై బాటలోనే పంజాబ్.. టోర్నీ నుంచి ఔట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

 

Trending News