Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

Energizer Hard Case P28K Price In India: మార్కెట్‌లోకి 28,000mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ అయ్యింది. ఈ మొబైల్‌ అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2024, 10:29 AM IST
Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

Energizer Hard Case P28K Price In India: ప్రస్తుతం చాలా మంది యువత ఎక్కువ కాలం పాటు బ్యాటరీ లైఫ్‌ను అందించే స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెక్‌ కంపెనీ ఎనర్జైజర్ బ్రాండ్ Energizer Hard Case P28K స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మొట్టమొదటి సారిగా ఈ మొబైల్‌ ఎంతో శక్తివంతమైన 28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యింది. అంతేకాకుండా ఇది ఒక్కసారి చార్జ్‌ చేస్తే దాదాపు 94 రోజుల పాటు స్టాండ్‌బై మోడ్‌లో పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లో అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అవేంటో, ఈ మొబైల్‌లో ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గతంలో కూడా ఈ  ఎనర్జైజర్ కంపెనీ 18,000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ మొబైల్‌కి కూడా మంచి స్పందన లభించింది. ఇక ఎనర్జైజర్ హార్డ్ కేస్ P28K స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాల్లోకి వెళితే..ఇది యూకేలో EUR 250 ధరతో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ భారత్‌తో లాంచ్‌ అయితే దాదాపు  రూ. 22,000తో అందుబాటులోకి వచ్చే అవకాశాలుయ ఉన్నాయని టిప్‌స్టర్స్‌ తెలిపారు. దీనిని కంపెనీ  ఈ ఏడాది అక్టోబర్‌లో రెండు లేదా మూడవ వారంలో లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

ఎనర్జైజర్ హార్డ్ కేస్ P28K ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ఈ ఎనర్జైజర్ హార్డ్ కేస్ P28K స్మార్ట్‌ఫోన్‌ లాంగ్‌ లైఫ్‌ వార్క్‌ చేసే 28,000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. దీనిని కేవలం ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు గరిష్టంగా 2252 గంటల పాటు స్టాండ్‌బై అందిస్తుందని టెక్‌ నిపుణులు తెలుపుతున్నారు. రోజుల్లో చూస్తే దాదాపు 94 రోజుల పాటు పని చేస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ కేవలం 1 గంట 30 నిమిషాల పాటు చార్జ్‌ చేస్తే బ్యాటరీ ఫుల్‌ అవుతుంది. ఈ మొబైల్‌ చూడడానికి గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది వాటర్-రెసిస్టెంట్ బిల్డ్‌ని కలిగి ఉంటుంది. కాబట్టి సులభంగా దీనిని వాటర్‌ వర్క్‌ చేసే క్రమంలో కూడా వినియోగించవచ్చు. 

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో మొదటి కెమెరా 60-మెగాపిక్సెల్‌తో అందుబాటులో ఉంటుంది. అదనంగా 20 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో పాటు 2-మెగాపిక్సెల్ కెమెరాలు ఉంటాయి. అంతేకాకుండా స్పెల్పీ కోసం అదనంగా 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అలాగే ఈ మొబైల్ 6.78 అంగుళాల డిస్‌ప్లేతో లభిస్తోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ 4K నాణ్యతతో వీడియోలను రికార్డ్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. 

ఇతర ఫీచర్లు:
28,000mAh బ్యాటరీ
మీడియాటెక్ హ Helio P70 ప్రాసెసర్
6GB ర్యామ్, 128GB స్టోరేజీ
6.2-అంగుళాల HD+ డిస్ప్లే
ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్
60-మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా
13MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా

Also Read Ibomma Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News