Flipkart mobile Offers: ఐఫోన్ 15 ప్రో పై ఊహించని డిస్కౌంట్, ధర ఎంతంటే

Flipkart offers on iPhone 15: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఐఫోన్ సిరీస్‌లో లేటెస్ట్ ఐఫోన్ 15 మీరు ఊహించని ధరకు లభ్యం కానుంది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 31, 2024, 06:38 PM IST
Flipkart mobile Offers: ఐఫోన్ 15 ప్రో పై ఊహించని డిస్కౌంట్, ధర ఎంతంటే

Flipkart offers on iPhone 15: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న భారీ డిస్కౌంట్ ఐ ఫోన్ 15 ప్రోకు లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఐఫోన్ 15 ప్రో డీల్ ఎప్పటి వరకూ అందుబాటులో ఉంటుందో క్లారిటీ లేకపోయినా తొందరలోనే ముగుస్తుందని తెలుస్తోంది. ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ సేల్ అని చూపిస్తోంది. మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్‌లో భాగంగా ప్లిప్‌కార్ట్ ఈ ఆఫర్ అందిస్తోంది. 

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ప్రో 128 జీబీ వేరియంట్ అయితే 1,34,900 రూపాయలతో ప్రారంభమౌతుంది. కానీ 7 వేల రూపాయల ఇన్‌స్టంట్ డిస్కౌంట్, వివిధ బ్యాంకు కార్డులపై మరో 3 వేల రూపాయలు డిస్కౌంట్ మినహాయించగా ఈ ఫోన్ 1,24, 900 రూపాయలు లభించనుంది. ఇక ఐఫోన్ 15 ప్రో కాకుండా ఐఫోన్ 15 కూడా ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది. ఇందులో బ్లూ కలర్ మోడల్ ఫోన్ చాలా తక్కువ ధరకు లభిస్తోంది. ఫోన్ కలర్‌ను బట్టి ధర మారుతోంది. ఐఫోన్ 15 బ్లూ కలర్ ఫోన్ ధర 65,999 రూపాయలుగా ఉంది. అదే బ్లాక్ లేదా గ్రీన్ అయితే 66,999 రూపాయలుగా ఉంది. ఇందులోనే పింక్ కలర్ ఫోన్ 667,999 రూపాయలు లభించనుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే మరో 1250 రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది. ఇది బ్లాక్ కలర్ ఫోన్ పై లభించే డిస్కౌంట్. అదే గ్రీన్ కలర్ వెర్షన్ పై హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కార్డుతో కొనుగోలు చేస్తే 1000 రూపాయలు తగ్గుతుంది. ఐఫోన్ 15 అసలు ధర 79,900 రూపాయలు. ఐఫోన్ 15 ప్లస్ అయితే 80,999 రూపాయలకు డిస్కౌంట్ అనంతరం లభిస్తోంది. 

Also read: NGLV Rocket: ఇస్రో నుంచి కొత్త రాకెట్, ఇక మనుషుల్నీ మోసుకెళ్తుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News