Flipkart Big Billion Sale: ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ఆఫర్లు, Google Pixel 6Aపై 16 వేల డిస్కౌంట్

Flipkart Big Billion Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ ప్రారంభమైపోయింది. బ్రాండెడ్ మొబైల్ ఫోన్లపై భారీగా ఆఫర్లు లభిస్తున్నాయి. గూగుల్ పిక్సెల్ లేటెస్ట్ ఫోన్‌పై ఏకంగా 16 వేల డిస్కౌంట్ లభిస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 13, 2022, 05:10 PM IST
Flipkart Big Billion Sale: ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ఆఫర్లు, Google Pixel 6Aపై 16 వేల డిస్కౌంట్

Flipkart Big Billion Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్ ప్రారంభమైపోయింది. బ్రాండెడ్ మొబైల్ ఫోన్లపై భారీగా ఆఫర్లు లభిస్తున్నాయి. గూగుల్ పిక్సెల్ లేటెస్ట్ ఫోన్‌పై ఏకంగా 16 వేల డిస్కౌంట్ లభిస్తోంది. 

Flipkart Big Billion sale 2022 ప్రారంభమైంది. వివిధ మొబైల్ బ్రాండ్లపై భారీగా డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఇటీవల ఇండియాలో లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 6ఏ కూడా ఇందులో ఉంది. ఈ లేటెస్ట్ మొబైల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుతోంది. Google Pixel 6a అసలు ధర 43,999 రూపాయలు కాగా దీనిపై 16 వేలకు పైగా డిస్కౌంట్ లభి‌ది. డిస్కౌంట్ అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 27,699 రూపాయలు లభించనుంది. ఈ ఆఫర్ ఎలా వర్తిస్తుందో చూద్దాం..

Google Pixel 6a విక్రయాల సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధర 34,199 రూపాయలుగా ఉంది. ప్రీపెయిడ్ ద్వారా చెల్లింపు జరిపితే 3500 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా యాక్సిన్ బ్యాంక్, ఐసీఐసీఐ కార్డు యూజర్లకు 3000 రూపాయలు అదనంగా డిస్కౌంట్ అందుతుంది. అన్ని ఆఫర్లు వర్తించిన తరువాత ఈ స్మార్ట్‌ఫోన్ ధర 27,699 రూపాయలుగా ఉంది. 

Google Pixel 6a అత్యంత సమర్ధనీయమైన స్మార్ట్‌ఫోన్లలో ఒకటి. దేశంలో లాంచ్ అయిన రెండేళ్లలో తొలి పిక్సెల్ ఫోన్ ఇది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ 6.1 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇందులో 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ టైటన్ ఎం2 సెక్యూరిటీ కో ప్రోసెసర్ ఉంది.12.2 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ కోసం గూగుల్ పిక్సెల్ 6ఏలో 8 మెగాపిక్సెల్ ఉంది. 

Also read: LIC Saral Pension Yojana: సింగిల్ ప్రీమియం చెల్లిస్తే..జీవితాంతం నెలకు 50 వేల రూపాయల పెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News