LIC Saral Pension Yojana: ఎల్ఐసీలో ఎన్నో అద్భుతమైన పాలసీలున్నాయి. అందులో ఒకటి ఎల్ఐసీ సరళ్ పెన్షన్ యోజన. సింగిల్ ప్రీమియం చెల్లిస్తే చాలు..జీవితాంతం నెలకు 50 వేల రూపాయలు పెన్షన్ పొందవచ్చు..
ఎల్ఐసీ నుంచి మరో పాలసీ వచ్చింది. ఎల్ఐసీ సరళ్ పెన్షన్ యోజన పేరుతో ఈ పథకం ప్రారంభమైంది. ఇందులో 40 ఏళ్ల వయస్సు నుంచి డబ్బు అందుతుంటుంది. సింగిల్ ప్రీమియం చెల్లించి..40 ఏళ్ల నుంచే జీవితాంతం పెన్షన్ పొందే అవకాశముంటుంది.
ఆర్ధికంగా ప్లానింగ్ బాగుంటే జీవిత చరమాంకంలో అంటే వృద్ధాప్యంలో ఆనందంగా గడపవచ్చు. ప్రతి ఒక్కరి ఆలోచన కూడా ఇదే ఉంటుంది. ఆర్ధిక పరమైన ఇబ్బందుల్లేకుండా గడపడమనేది చాలా కష్టమే. అందుకే భవిష్యత్ భరోసా కోసం చాలామంది ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తుంటారు.
అందుకే ఎల్ఐసీ సరళ్ పెన్షన్ యోజన పథకం మంచి ప్రత్యామ్నాయం కాగలదు. ఇందులో 40 ఏళ్ల వయస్సు నుంచే డబ్బులు అందడం ప్రారంభమౌతుంది. ఇదొక సింగిల్ ప్రీమియం పెన్షన్ ప్లాన్. ఇందులో ప్రీమియం ఒకేసారి చెల్లిస్తారు. జీవితాంతం సంపాదిస్తారు. మరోవైపు సరళ్ పెన్షన్ యోజన అనేది తక్షణం అమల్లో వచ్చే ప్లాన్. అంటే మీరు పాలసీ తీసుకున్న వెంటనే పెన్షన్ కూడా ప్రారంభమైపోతుంది.
రెండు రకాల ప్రీమియం కేటగరీలు
సింగిల్ లైఫ్
ఇందులో పాలసీదారుడి పేరుతోనే పాలసీ ఉంటుంది. ఏ పరిస్థితుల్లో అయినా పాలసీ మరొకరి పేరుపై బదిలీ కాదు. పెన్షనర్ బతికున్నంతవరకూ పెన్షన్ అందుతుంది. అతని మరణానంతరం బేసిక్ ప్రీమియం నామినీకు చెల్లిస్తారు.
జాయింట్ లైఫ్
ఇందులో ఇద్దరికీ కవరేజ్ ఉంటుంది. ప్రైమరీ పెన్షనర్లు బతికున్నంతవరకూ పెన్షన్ అందుతుంది. అతని మరణానంతరం భార్యకు పెన్షన్ జీవితాంతం అందుతుంది. ఆమె కూడా మరణిస్తే ప్రీమియం మొత్తం నామినీకు చెల్లిస్తారు.
ఈ పెన్షన్ స్కీమ్ వయస్సు 40 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకూ ఉంటుంది. ఇది జీవితాంతం వర్తించే పాలసీ అయినందున పెన్షన్ కూడా జీవితాంతం అందుతుంది. ఎల్ఐసీ సరళ్ పెన్షన్ పాలసీ ఆరు నెలల తరువాత ఎప్పుడైనా సరెండర్ చేయవచ్చు. పెన్షన్ ప్రతి నెలా తీసుకోవచ్చు. మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి కూడా తీసుకోవచ్చు.
పెన్షన్ స్కీమ్ వివరాలు
ప్రతి నెలా డబ్బులు కావాలంటే..కనీసం వేయి రూపాయల పెన్షన్ తీసుకోవాలి. దీనికోసం కనీస పెన్షన్ 12 వేలది ఎంచుకోవాలి. సింగిల్ ప్రీమియం 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే..ఏడాదికి 50, 250 రూపాయలు అందుతాయి. ఇది కాకుండా మద్యలో డబ్బులు వెనక్కి కావాలనుకుంటే..5 శాతం తగ్గించి వెనక్కి ఇస్తారు.
Also read: Amazon Discount Offer: విక్రేతలకు అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్, 50 శాతం డిస్కౌంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook