HMD Smartphone: హెచ్ఎండీ నుంచి 50 ఎంపీ కెమేరా, 8జీబీ ర్యామ్‌తో తొలి స్మార్ట్‌ఫోన్

HMD Smartphone: కనెక్టింగ్ పీపుల్ అంంటూ మొబైల్ ఫోన్ తొలిరోజుల్లో సంచలనం రేపిన నోకియా గురించి తెలియనివాళ్లుండరు. ఈ ఫోన్లను తయారు చేసే హెచ్‌ఎండీ ఇప్పుడు సొంతంగా స్మార్ట్‌ఫోన్లు తయారు చేయనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 27, 2024, 08:22 PM IST
HMD Smartphone: హెచ్ఎండీ నుంచి 50 ఎంపీ కెమేరా, 8జీబీ ర్యామ్‌తో తొలి స్మార్ట్‌ఫోన్

HMD Smartphone: హ్యూమన్ మొబైల్ డివైస్ స్థూలంగా చెప్పాలంటే హెచ్ఎండీ సంస్థ ఇప్పటి వరకూ నోకియా బ్రాండ్‌తో మొబైల్ ఫోన్లు తయారు చేస్తూ వచ్చింది. ఇక నుంచి సొంత బ్రాండ్‌తో మొబైల్ ఫోన్స్ తయారు చేయాలని హెచ్‌ఎండీ నిర్ణయించింది. త్వరలోనే హెచ్ఎండీ కంపెనీ సొంత బ్రాండ్ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫీచర్లు ఇతర వివరాల గురించి తెలుసుకుందాం.

హెచ్ఎండీ కంపెనీ ఏప్రిల్ 29వ తేదీన పల్స్ లేదా లెజెండ్ పేరుతో తొలి స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. ఫోన్ల తయారీ కొత్తకాకున్నా..సొంత బ్రాండ్‌తో తయారీ ఇదే తొలిసారి. పల్స్ సిరీస్ తొలి స్మార్ట్‌ఫోన్ 6.56 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉండి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. అంతేకాకుండా 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ సామర్ధ్యంతో ఉంటుంది. ఇందులో పల్స్ ప్లస్ అయితే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్ధ్యంతో ఉంటుంది. ఇక బ్యాటరీ అయితే 5000 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉండి  10 వాట్స్ ఫాస్టింగ్ ఛార్జింగ్‌తో ఉంటుంది. 

ఇక హెచ్ఎండీ పల్స్ ప్రో అయితే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్ధ్యంతో 20 వాట్స్ ఫాస్టింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇక కెమేరా అయితే అద్భుతంగా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ఉంటుంది. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉండవచ్చు. ఈ హ్యాండ్ సెట్ Unisoc T606 ప్రోసెసర్‌తో ఉండి సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 

Also read: Old vs New Tax Regime: పాత, కొత్త ట్యాక్స్ విధానాల్లో ఏది ఎవరు ఎంచుకోవాలి

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News