కరోనా వీడియోపై సారీ చెప్పిన ఛార్మి

ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్న 'కరోనా వైరస్' పై నటి ఛార్మి చేసిన టిక్ టాక్ వీడియో బూమరాంగ్ అయింది. దీంతో ఆమెపై నెటిజనులు విమర్శల వర్షం కురిపించారు. వరుసగా ట్రోల్ చేశారు. దీంతో దిగొచ్చిన భామ సారీ చెప్పింది.

Last Updated : Mar 3, 2020, 09:36 AM IST
కరోనా వీడియోపై సారీ చెప్పిన ఛార్మి

ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్న 'కరోనా వైరస్' పై నటి ఛార్మి చేసిన టిక్ టాక్ వీడియో బూమరాంగ్ అయింది. దీంతో ఆమెపై నెటిజనులు విమర్శల వర్షం కురిపించారు. వరుసగా ట్రోల్ చేశారు. దీంతో దిగొచ్చిన భామ సారీ చెప్పింది. 

 ‘కరోనా వైరస్’హైదరాబాద్ కు వచ్చిందట .. గైస్ ఆల్ ది బెస్ట్ అంటూ నటి ఛార్మి టిక్ టాక్ లో ఓ వీడియో చేసి పోస్ట్ చేసింది. నిన్న హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. దీంతో హైదరాబాద్‌తోపాటు తెలంగాణలో కలకలం రేగింది. కానీ ఇవేవీ పట్టించుకోకుండా  నటి ఛార్మి .. కరోనా వైరస్ హైదరాబాద్ వచ్చేసిందంటూ ఓ వీడియో చేసింది. ఆల్ ది బెస్ట్ గైస్ అంటూ పోస్టులో చెప్పడం నెటిజనులకు మరింత ఆగ్రహం తెప్పింది. దీంతో ఆమెను ట్రోల్ చేస్తూ కామెంట్లు పెట్టారు. ‘కరోనా వైరస్’తో బెంబేలెత్తిపోతుంటే స్వాగతించడమేంటని ప్రశ్నించారు. దీంతో మేలుకున్న నటి ఛార్మి ఆ వీడియోను డిలీట్ చేసింది.

Also Read: టీమిండియా వైట్ వాష్‌కు 5 కారణాలు!  

See Pics: ఆ ఫొటోలపై ఇవాంక ట్రంప్ ఏమన్నారో తెలుసా?     జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News