అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కుటుంబంతో ఇటీవల రెండు రోజులపాటు భారత్లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే రెండేళ్ల కిందట ఏం జరిగిందో.. మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. గతంలోలాగానే అందరి కళ్లూ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్ మీదే నిలిచాయి. ఆమె ధరించిన దుస్తులు, వాటి ధర, ఆమె ఈరకం పాదరక్షలు ధరించారంటూ నెట్టింట ఆమె వివరాలపై జోరుగా పోస్టులు వచ్చాయి. ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ సైతం పలు కార్యక్రమాల్లో పాల్గొన్ని పర్యటనలో తనవంతు పాత్రను పోషించారు.
ఆ ఫొటోలపై ఇవాంక ట్రంప్ ఏమన్నారంటే!