Revanth Reddy: వివాదంలో రేవంత్ రెడ్డి.. కేసు పెట్టిన సొంత పార్టీ నేత.. ఆయన జంపింగ్ ఖాయమేనా?

Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ నేతే రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

Written by - Srisailam | Last Updated : Aug 27, 2022, 05:48 PM IST
  • పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు
  • ఫిర్యాదు చేసిన సొంత పార్టీ నేత
  • విష్ణువర్దన్ రెడ్డి జంప్ చేస్తారా?
Revanth Reddy: వివాదంలో రేవంత్ రెడ్డి.. కేసు పెట్టిన సొంత పార్టీ నేత.. ఆయన జంపింగ్ ఖాయమేనా?

Revanth Reddy: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాంట్రవర్శీ కామెంట్లు చేశారంటూ గతంలోనూ రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. కొన్ని సార్లు టీఆర్ఎస్ నేతలు.. కొన్ని సార్లు బీజేపీ నేతలు ఆయనపై ఫిర్యాదు చేశారు. కాని తాజా వివాదంలో మాత్రం సొంత పార్టీ నేతే రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై  బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కంప్లైంట్ చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రేవంత్ పై ఆయన కేసు పెట్టారు. రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. దేశ వ్యాప్తంగా సంచలనమైన జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో సంచలన ఆరోపణలు చేశారు. పెద్దమ్మ గుడి ప్రాంగణంలోనే సామూహిక అత్యాచార ఘటన జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. ఆలయంలో గ్యాంగ్ రేప్ జరిగినా బీజేపీ నేతలు కనీసం స్పందించలేదన్నారు. ఎన్నికలు లేవు కాబట్టే బీజేపీ నేతలు పట్టించుకోలేదన్నారు.  రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపైనే విష్ణువర్దన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పెద్దమ్మ తల్లి టెంపుల్ ప్రధాన ట్రస్టీగా ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి . అందుకే ఆయన రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. పెద్దమ్మ గుడిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదని చెప్పారు, రేవంత్ రెడ్డి కామెంట్లు తప్పని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు.   జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గా ఉన్న  విష్ణువర్ధన్ రెడ్డి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ పార్టీలో సెగలు రేపుతోంది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు విష్ణువర్దన్ రెడ్డి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. తాజా ఘటనతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

దివంగత పీజేఆర్ మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు విష్ణువర్దన్ రెడ్డి. ఖైరాతాబాద్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఇటీవలే విష్ణు సోదరి ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ రెడ్డి టీమ్ లో ఆమె పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయారెడ్డికి జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో విష్ణువర్దన్ రెడ్డి ఓపెన్ గానే తన అసమ్మతి వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా ఎలా పార్టీలో చేర్చుకుంటారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తన నివాసంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించారు. తర్వాత విష్ణువర్దన్ రెడ్డి సైలెంట్ అయ్యారు. తాజాగా ఆయన రేవంత్ రెడ్డిపై ఏకంగా కేసు పెట్టడం కాక రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో విష్ణువర్దన్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు.

Read also: సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది! మునావర్ షో వివాదంపై కేటీఆర్ షాకింగ్..

Read also: Jayalalithaa Death Probe: సీఎం స్టాలిన్‌ వద్దకు చేరిన జయలలిత డెత్ రిపోర్ట్..నివేదికలో అసలేముందంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News