KTR COMMENTS ON MUNAWAR: సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది! మునావర్ షో వివాదంపై కేటీఆర్ షాకింగ్..

KTR COMMENTS ON MUNAWAR: తెలంగాణ రాజకీయాలు గతంలో ఎప్పుడు లేనంతగా హీటెక్కాయి. చాలా కాలం తర్వాత హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి వచ్చింది. స్టాండప్ కమెడీయన్ మునావర్ ఫారూఖీ షో తర్వాతే హైదరాబాద్ లో పరిస్థితులు మారిపోయాయి. ఈనెల 20న హైటెక్ సిటీలోని శిల్పాకళావేదికలో మునావర్ ఫరూఖీ షో జరిగింది.

Written by - Srisailam | Last Updated : Aug 27, 2022, 04:11 PM IST
  • రాజాసింగ్ అరెస్ట్ పై స్పందించిన కేటీఆర్
  • మునావర్ పై పంచాయతీ ఎందుకు- కేటీఆర్
  • సిగ్గుతో తలదించుకునే పరిస్థితి- కేటీఆర్
KTR COMMENTS ON MUNAWAR: సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది! మునావర్ షో వివాదంపై కేటీఆర్ షాకింగ్..

KTR COMMENTS ON MUNAWAR: తెలంగాణ రాజకీయాలు గతంలో ఎప్పుడు లేనంతగా హీటెక్కాయి. చాలా కాలం తర్వాత హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించాల్సిన పరిస్థితి వచ్చింది. స్టాండప్ కమెడీయన్ మునావర్ ఫారూఖీ షో తర్వాతే హైదరాబాద్ లో పరిస్థితులు మారిపోయాయి. ఈనెల 20న హైటెక్ సిటీలోని శిల్పాకళావేదికలో మునావర్ ఫరూఖీ షో జరిగింది. బీజేపీ నేతల హెచ్చరికలతో షోకి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మునావర్ షోకు నిరసనగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన వీడియో రచ్చ రాజేసింది. ఆ వీడియో తర్వాత హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎంఐఎం కార్యకర్తల ఆందోళనతో పోలీసులు ఆంక్షలు విధించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఏకంగా పీడీ యాక్ట్ నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసుల. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ పెట్టడాన్ని హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. హైదరాబాద్ లో కొన్ని రోజులుగా జరిగిన ఘటనలకు అసలు కారణం ఎవరూ అన్న చర్చ జనాల్లో సాగుతోంది. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలే వివాదానికి కారణమని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా.. మునావర్ ఫారూఖీ షో వల్లే సమస్యలు వచ్చాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో తర్వాత తలెత్తిన అల్లర్లపై తొలిసారి స్పందించారు మంత్రి కేటీఆర్. రాజాసింగ్ వీడియోతో పాటు మునావర్ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పబ్బం కోసం మత విధ్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ నేతలు మునావర్ పై పంచాయితీ చేస్తున్నారని విమర్శించారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.  ఏ దేవుడు చెప్పిండు.. త‌న్నుకు చావండ‌ని కేటీఆర్ నిలదీశారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను విడుదల చేసిన అనంతరం మాట్లాడన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

త‌న్నుకు చావండ‌ని కృష్ణుడు చెప్పిండా? రాముడు చెప్పిండా? యేసుక్రీస్తు చెప్పిండా? అల్లా చెప్పిండా? అని ప్రశ్నించారు కేటీఆర్.  నా మ‌న‌షుల‌ను పంపిస్తున్న భూమి మీద‌కు.. ఒక‌రికొక‌రు త‌న్నుకు చావండి.. ఎవ‌రి దేవుడు గొప్ప‌ అనే కాంపిటీష‌న్ పెట్టుకొని త‌న్నుకు చావండి అని చెప్పిండా? అంటూ  కేటీఆర్ ఉద్వేగంగా మాట్లాడారు. ఎందుకు కొట్లాడుతున్నాం.. ఎవ‌రి కోసం కొట్లాడుతున్నాం.. ఏ కార‌ణం చేత కొట్లాడుతున్నామంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా నీళ్ల కోసం జనాలు రోడ్లపైకి వస్తున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికయ్యాకా ఆమె స్వగ్రామానికి కరెంట్ సరఫరా ఇచ్చామని గొప్పులు చెప్పుకునే దీనస్థితిలో ఉన్నామన్నారు కేటీఆర్. ప్రజా సమస్యలపై సోయి లేకుండా  ఏ దేవుడు గొప్ప‌ అని ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితులు ఇండియాలో ఉండటం దౌర్బాగ్యమన్నారు.మ‌తాల మీద ప‌డి మ‌నం ఎక్క‌డ్నో పోతున్నాం.. చైనా వాడేమో 16 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరిండని కేటీఆర్ అన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News