BRS Party: గులాబీ పార్టీకి భారీ దెబ్బ.. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డి

Bethi Subhas Reddy Resign To BRS Party And Joins In BJP: బీఆర్‌ఎస్‌ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. హైదరాబాద్‌లో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేసి వెంటనే కాషాయ పార్టీలో చేరాడు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 18, 2024, 01:40 PM IST
BRS Party: గులాబీ పార్టీకి భారీ దెబ్బ.. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డి

Bethi Subhas Reddy: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పార్టీ నాయకులు భారీగా వీడుతుండగా తాజాగా మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పార్టీని వీడారు. ఈ మేరకు సుభాష్‌ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తూ లేఖ పంపించారు. అయితే ఆయన అధికార కాంగ్రెస్‌ పార్టీలో కాకుండా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతు ప్రకటించడం గమనార్హం.

Also Read: Cash For Vote: మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు.. చంద్రబాబు, రేవంత్‌ రెడ్డికి ఉచ్చు బిగియనుందా?

రాజీనామా లేఖలో సుభాష్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'నా మీద ఎలాంటి మచ్చ లేకున్నా పార్టీలో కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు. టికెట్‌ ఇచ్చే ముందు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎంపీ ఎన్నికల్లోనైనా అవకాశం ఇస్తారని ఆశిస్తే పార్టీలో ఎలాంటి చర్చ చేయకుండా రాగిడి లక్ష్మారెడ్డికి అవకాశం ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ అవకాశవాదులను గెలిపించడం కంటే ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్‌ను గెలిపించాలనుకుంటున్నా. ఈ నేపథ్యంలో పార్టీ ప్రాథమిక శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా' అని బేతి సుభాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Also Read: Revanth Is Lilliput: 'రేవంత్‌ రెడ్డి ఒక లిల్లీపుట్‌': కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

 

రాజీనామా చేసిన వెంటనే సుభాష్‌ రెడ్డి బీజేపీలో చేరారు. మల్కాజిగిరి లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌కు మద్దతుగా ఆ పార్టీలో చేరారు. శామీర్‌పేటలోని ఈటల నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం ఈటల రాజేందర్‌ నామినేషన్‌ ర్యాలీలో పాల్గొన్నారు.

అప్పుడే అలక..
బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి 2018 ఎన్నికల్లో ఉప్పల్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన సుభాష్‌ రెడ్డి 2023లోనూ సీటు ఆశించారు. కానీ ఉప్పల్‌ స్థానానికి తీవ్ర పోటీ నెలకొన్న సమయంలో సుభాష్‌ను కాదని బండారు లక్ష్మారెడ్డికి టికెట్‌ ఇవ్వగా.. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్నికల సమయంలోనే పార్టీని వీడుతారని భావించగా.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన గులాబీ పార్టీని వీడారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News