Revanth Reddy Is Lilliput: అధికారం కోల్పోయిన తర్వాత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గాయం నుంచి కోలుకున్న అనంతరం మళ్లీ కేసీఆర్ తన ధాటి, వాగ్ధాటి కొనసాగిస్తున్నారు. మళ్లీ రాజకీయ వ్యూహానికి పదును పెట్టి విస్తృత పర్యటన చేపట్టిన గులాబీ బాస్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా సుల్తాన్‌పూర్‌లో నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ సంచలన ప్రసంగం చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని లిల్లిపుట్ ప్రభుత్వంగా అభివర్ణించారు.
Also Read: Revanth Strikes BJP: తెలంగాణ బీజేపీకి భారీ షాక్.. రేవంత్ దెబ్బకు కాషాయ పార్టీ కకావికలం
తన సొంత జిల్లా మెదక్‌పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొంత భావోద్వేగానికి లోనయ్యారు. 'మెదక్ జిల్లా ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే తెలంగాణ సాధించా. అసెంబ్లీ ఎన్నికల్లోనూ మెదక్ ప్రజలు ఏడు సీట్లు అందించి ఆశీర్వదించారు. నా రాజకీయ ఎదుగుదలలో మెతుకు సీమది కీలకపాత్ర. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలంటే పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ ఎంపీలు ఉండాలి. పాలిచ్చే బర్రెను పోగొట్టుకుని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు' అని కేసీఆర్ తెలిపారు. జహీరాబాద్ ఎంపీగా గాలి అనిల్ కుమార్‌ను, మెదక్ ఎంపీగా వెంకట్రామ్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.
Also Read: Revanth Reddy: 'కవిత బెయిల్ కోసం మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం': రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించకపోవడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. 'అంబేడ్కర్ విగ్రహానికి ఒక్క పూలమాల వేయలేరా? అంత కండ కావరమా? బలుపా?' అని కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. 'మహానీయుడు అంబేడ్కర్ విగ్రహం పెట్టిన తర్వాత వచ్చిన మొదటి జయంతి ఇది. అలాంటిది విగ్రహానికి ఒక పువ్వు పెట్టలేదు, ఒక పూలమాల వెయ్యలేదు, అంజలి ఘటించలేదు. అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తే కనీసం మంచి నీళ్లు పెట్టకుండా, విగ్రహం దగ్గరికి వెళ్లకుండా గేట్లకు తాళాలు వేశారు' అని కేసీఆర్ తెలిపారు.
'మేము కట్టిన విగ్రహం దగ్గరికి వెళ్లనప్పుడు, మేము కట్టిన సెక్రటేరియేట్‌లో ఎందుకుంటున్నారు? మేము కట్టిన యాదగిరిగుట్ట దగ్గరకు ఎందుకు పోయి మొక్కుకున్నారు? మేము కట్టిన ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎందుకుంటున్నారు?' అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేసీఆర్ దుమ్మెత్తిపోశారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ నాయకులపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టినందుకు సల్వాజీ మాధవరావు అనే ఉద్యమకారుడిని అక్రమ కేసులు జైల్లో పెట్టించారు' అని కేసీఆర్ తెలిపారు. పోలీసుల చిట్టా తాము రాసుకుంటామని హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter