Cash For Vote: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఆ కేసు న్యాయస్థానం ముందు విచారణకు రానుంది. విచారణల నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నాటి టీడీపీ ఎమ్మెల్యే నేటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉచ్చు బిగుస్తుందా? అని తీవ్ర చర్చ జరుగుతోంది. విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని తెలుగు రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Also Read: AP Elections: ఏపీ ఎన్నికలపై ప్రముఖ హీరో జోష్యం.. ఆంధ్రప్రదేశ్‌లో గెలిచేది అతడే?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఓటు కొనుగోలు కోసం 2015లో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సహాయం డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఏడేళ్లయినా విచారణలో పురోగతి లేకపోవడంతో ఏపీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ ఈ కేసును కదిలించారు. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 'ఓటుకు నోటు కేసు' విచారణ జరగనుంది. ఈ కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్యే ఆర్కే కోరుతున్నారు. ఇదే విషయమై పిటిషన్ వేయగా న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీనిపై బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ కేసు విషయమై ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
Also Read: Jagan Stone Attack: జగన్‌పై రాళ్ల దాడిలో కీలక మలుపు.. రూ.350 క్వార్టర్ మందు కోసం రాయితో దాడి?
'నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఓటు కోసం 2015లో రేవంత్ రెడ్డి రూ.50 లక్షల నగదు ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. దీనికి ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ కేసుపై 2017లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాను. ఈ కేసుపై ఐదు నెలల్లో చిన్న చిన్న కారణాలతో వాయిదా వేశారు. రేపు కేసు విచారణ జరుగుతోంది. చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని పిటిషన్ వేశా' అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వివరించారు. అన్నీ సాక్ష్యాలు ఉండి కేసు విచారణ ఆలస్యం కావడంతో తప్పుడు సంకేతాలు వస్తున్నాయి అని పేర్కొన్నారు.
'ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారు. తెలంగాణ ఏసీబీ ఈ కేసును సక్రమంగా విచారణ చేయడం లేదు. ఈ కేసును సీబీఐ విచారణ చేయాలి. ఈ కేసులో బాబును నిందితుడిగా చేర్చాలి. దీంతోపాటు మూడు కేసులో పెండింగ్ ఉన్నాయి' అని ఆర్కే వెల్లడించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినా చంద్రబాబు సిగ్గు లేకుండా బుకాయిస్తున్నారు. రెడ్ హ్యాండెడ్‌గా ఆడియో, వీడియోలో దొరికిన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగేలా ఈ కేసు విచారణ ఉండాలి' అని సుప్రీంకోర్టును ఎమ్మెల్యే ఆర్కే కోరారు. న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter