YS Sharmila: నువ్వు రా కొ**.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

YS Sharmila Fires on BRS MLA Shankar Naik: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. శనివారం మహబూబాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు ఓ రేంజ్‌లో కౌంటర్ ఇస్తూ.. సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2023, 06:55 PM IST
YS Sharmila: నువ్వు రా కొ**.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

YS Sharmila Fires on BRS MLA Shankar Naik: బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ప్రశ్నిస్తే కొజ్జాలు అంటావా..? శంకర్ నాయక్ ఎవడ్రా కొజ్జా..? అంటూ ఫైర్ అయ్యారు. హామీలు అమలు చేయని నువ్వు రా కొజ్జా..! అని ఘాటుగా విమర్శించారు. మహబూబాబాద్ ఎమ్మార్వో ఆఫీస్ సర్కిల్ వద్ద నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. శంకర్ నాయక్ తమను కొజ్జాలని అంటున్నాడని.. ఎవడ్రా కొజ్జా శంకర్ నాయక్..? అని నిలదీశారు.

'ఇక్కడ ఎమ్మెల్యే శంకర్ నాయక్.. ఈ శంకర్ నాయక్ మేము కొజ్జాలం అని అంటున్నాడు. ప్రజల పక్షాన నిలబడితే కొజ్జాలు అంటున్నాడు. ఏవడ్రా కొజ్జా శంకర్ నాయక్..?. నువ్వు కాదారా కొజ్జా..? ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోక పోతే నువు కాదారా కొజ్జా..? రైతు రుణమాఫీ చేయక మీరు కోజ్జాలు కాక ఏమైతరు రా అని అడుగుతున్న.. 6 నెలల్లో పోడు పట్టాలు ఇవ్వని మీరు కొజ్జాలు కాక ఏమైతర్రా అని అడుగుతున్నాం.. మీకు పరిపాలన చేతనయ్యిందా..? ఒక మహిళను పట్టుకొని కొజ్జా అని అంటావా..? నువు కొజ్జా అంటే నేను ఊరుకోవాలా..?' అని వైఎస్ షర్మిల అన్నారు.

'రాష్ట్రంలో, దేశంలో హిజ్రాలకు గౌరవంగా బతుకుతున్నారని ఆమె అన్నారు. ఈ ఎమ్మెల్యే కొజ్జా కంటే హీనం అని మండిపడ్డారు. తమను వలసదారులమని అంటున్నారని..  మరి నీ భార్య ఎక్కడ నుంచి వచ్చింది..? అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. 'నెల్లూరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నవు కదా.. నీకు తెలంగాణపై అంత ప్రేమ ఉంటే నీ భార్యకు విడాకులు ఇవ్వు.. నిజానికి నీ భార్య నీకు విడాకులు ఇవ్వాలి. ఒక ఐఏఎస్ చెయ్యి పట్టుకున్న నాడే నీకు విడాకులు ఇవ్వాల్సి ఉంది. ఒకప్పుడు ఏఈగా పని చేసి ఏసీబీలో పట్టుబడ్డాడట. లంచాలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన దొంగ ఈ శంకర్ నాయక్. ఈ లంచగొండి ఉద్యోగం పోగొట్టుకొని ఎమ్మెల్యే అయ్యి కూర్చున్నాడు.' అని ఘాటు విమర్శలు చేశారు వైఎస్ షర్మిల.

Also Read: Geetha Singh: రోడ్డు ప్రమాదంలో హాస్యనటి గీతాసింగ్ కుమారుడు మృతి  

Also Read: Ind VS Aus: నాథన్ లైయన్ పంజా.. అక్షర్ పటేల్ ఎదురుదాడి.. రసపట్టులో రెండో టెస్ట్   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News