Ind VS Aus: నాథన్ లైయన్ పంజా.. అక్షర్ పటేల్ ఎదురుదాడి.. రసపట్టులో రెండో టెస్ట్

IND vs AUS 2nd Test Day 2 Highlights: రెండో టెస్ట్ ఉత్కఠ భరితంగా మారింది. తొలి ఇన్సింగ్స్‌లో ఒక పరుగు ఆధిక్యం సంపాదించిన ఆసీస్.. రెండో ఇన్సింగ్స్‌లో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. మొదటి ఇన్సింగ్స్‌లో భారత్ 262 పరుగులకే ఆలౌట్ అయింది. 139 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయిన టీమిండియాను అక్షర్ పటేల్, అశ్విన్ గట్టెక్కించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2023, 06:05 PM IST
  • తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు భారత్ ఆలౌట్
  • రెండో ఇన్నింగ్స్‌ వికెట్ నష్టానికి ఆసీస్ 61 పరుగులు
  • మూడో రోజు ఆట కీలకం
Ind VS Aus: నాథన్ లైయన్ పంజా.. అక్షర్ పటేల్ ఎదురుదాడి.. రసపట్టులో రెండో టెస్ట్

IND vs AUS 2nd Test Day 2 Highlights: ఢిల్లీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఉత్కంఠ భరితంగా మారింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. ప్రస్తుతం మొత్తం ఆధిక్యం 62 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ట్రావిస్ హెడ్ (39), మార్నస్ లబుషేన్ (16) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతముందు టీమిండియా తొలి ఇన్సింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌట్ అయింది. నాథన్ లైయన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (74) ఎదురుదాడికి దిగి జట్టును కష్టాల్లో నుంచి గట్టెక్కించాడు. చివరకు ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో ఒక పరుగు ఆధిక్యం లభించింది. మూడో రోజు రెండు జట్లకు కీలకంగా మారనుంది. 

అంతముందు 21 పరుగుల స్కోరుతో రెండో రోజు ఆట ఆరంభించిన టీమిండియాకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. లైయన్ గింగిరాలు తిప్పే బంతులతో భారత బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెట్టాడు. కేఎల్ రాహుల్ (17), రోహిత్ శర్మ (32), పుజారా (0), శ్రేయాస్ అయ్యర్ (4)ను తక్కువ స్కోరు వ్యవధిలోనే పెవిలియన్‌కు పంపించాడు. దీంతో 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ సమయంలో విరాట్ కోహ్లీ (44), రవీంద్ర జడేజా (26) కాసేపు క్రీజ్‌లో నిలదొక్కుకోవడంతో కోలుకున్నట్లే కనిపించింది.

ఐదో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన తరువాత జడేజాను మార్ఫీ ఔట్ చేశాడు. తరువాత కాసేపటికే కోహ్లీని కుహ్నేమన్ పెలియన్‌కు పంపించాడు. తరువాత ఓవర్‌లోనే శ్రీకర్ భరత్ (6)ను లైయన్ ఔట్ చేసి మరింత దెబ్బ తీశాడు. 139 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయిన భారత్.. తక్కువ స్కోరుకే పరిమితమవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ సమయంలో అక్షర్ పటేల్ ఎదురుదాడికి దిగాడు. మరో ఎండ్‌లో రవిచంద్రన్ అశ్విన్ చక్కటి సహాకారం అందించాడు. వీలుచిక్కినప్పుడుల్లా బౌండరీలు బాదుతూ అక్షర్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ 8వ వికెట్‌కు 114 రన్స్ జోడించడంతో టీమిండియా కోలుకుంది. 

37 పరుగులు అశ్విన్‌ను కమ్మిన్స్ ఔట్ చేయగా.. మార్ఫీ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ ఔట్ అయ్యాడు. దీంతో 262 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. నాథన్ లైన్ ఐదు, మాథ్యూ కుల్నెమాన్ 3, టాడ్ మర్ఫీ 2 వికెట్లు తీశారు. కమ్మిన్స్ ఒక వికెట్ పడగొట్టాడు. ఒక పరుగు ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్‌కు జడేజా షాక్ ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో అదగొట్టిన ఖవాజా (6)ను త్వరగా పెవిలియన్‌కు పంపించి శుభారంభం అందించాడు. అయితే ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ మరో వికెట్ పడకుండా రెండో రోజు ఆటను ముగించారు.

Also Read: RCB Captain: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు కెప్టెన్ ప్రకటన.. స్టార్‌ ప్లేయర్‌కు బాధ్యతలు   

 Also Read: Bandi Sanjay: శివయ్యనే కేసీఆర్ మోసం చేశాడు.. మూర్ఖపు పాలన అంతం కావాలి: బండి సంజయ్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News